NTR Hrithik Roshan War 2 Pre Sales Records: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ అవెయిటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్‌కు ఇది బాలీవుడ్ డెబ్యూ మూవీ కాగా... సిల్వర్ స్క్రీన్‌పై ఇద్దరు ఐకానిక్ స్టార్స్ వార్ చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేశాయి.

ప్రీ సేల్స్... రికార్డ్స్ అదుర్స్

యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి ఆరో చిత్రంగా 'వార్ 2' రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా మూవీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్ జరుగుతున్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పటికే $100K డాలర్లు క్రాస్ అయ్యింది. అత్యంత వేగంగా 100,000 ముందస్తు టికెట్ల అమ్మకాలు దాటిన మూవీగా రికార్డు సృష్టించింది. కేవలం 7 గంటల్లోనే ఈ ఘనత సాధించగా... ఎన్టీఆర్ క్రేజ్ అంటే అట్లుంటది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ 'దేవర' మూవీకి ఇదే సేల్స్ జరగడానికి 11 గంటలు పట్టగా... 'వార్ 2'తో తన రికార్డును తానే తిరగరాశారు ఎన్టీఆర్.

Also Read: చెప్పు తెగుద్ది... మీ అమ్మ, చెల్లి అయితే ఇలా చేస్తారా? - యాంకర్ అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్

గెట్ రెడీ ఫర్ రిలీజ్

2019లో వచ్చిన 'వార్' మూవీకి సీక్వెల్‌గా 'వార్ 2' రాబోతుండగా... ఎన్టీఆర్ స్పై అధికారిగా కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా... హృతిక్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆగస్ట్ 14న హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్, హృతిక్‌ల మధ్య వార్ సీక్వెన్స్ మూవీకే హైలెట్స్ అని మేకర్స్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. దానికి తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇటీవల రిలీజ్ అయిన హృతిక్, కియారా మధ్య రొమాంటిక్ సింగిల్ కూడా ఆకట్టుకుంటోంది. 'నేను నా గుర్తింపు, కుటుంబం అన్నింటినీ వదిలేసి ఓ నీడగా మారిపోతాను' అంటూ హృతిక్ చెప్పే డైలాగ్... 'నేను యుద్ధంలో ఆయుధాన్ని' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌లో కనిపించడం హైప్ అమాంతం పెంచేసింది.

ఇద్దరు సోల్జర్స్ మధ్య వార్

ఇద్దరు సోల్జర్స్ మధ్య జరిగే వార్ 'వార్ 2' మూవీ అని తెలుస్తోంది. అసలు దేశం కోసం పోరాడే ఇద్దరు సోల్జర్స్ మధ్య వార్ ఎందుకు వచ్చింది? ఎందుకు వారు హోరాహోరీగా పోరాడారు? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ఇప్పటికే మూవీ టీం డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేస్తోంది. ఆడియన్స్‌కు మంచి ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు డాల్బీ అట్మోస్ థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు టీం వెల్లడించింది.