‘RRR’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో కలిసి ఓ ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్నారు. సుధాకర్‌ మిక్కిలినేని, కల్యాణ్‌ రామ్‌ సంయుక్తంగా  ‘NTR30’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్  సైఫ్‌ అలీ ఖాన్‌ నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు.  ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. వీఎఫ్ఎక్స్, స్టంట్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. 


‘NTR30’ సినిమాకు ‘దేవర’ అనే టైటిల్ ఫిక్స్?


ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్ డేట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు కొరటాల శివ ఓ పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పలు పేర్ల పరిశీలించిన తర్వాత ఈ చిత్రానికి ‘దేవ‌ర’ అనే టైటిల్ ఓకే చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హీరో ఎన్టీఆర్ సహా, చిత్ర నిర్మాతలు సైతం ఈ టైటిల్ బాగుందని చెప్పినట్లు సమాచారం. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్రబృందం ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ‘NTR30’ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్ ఫైనల్ అయ్యిందా? లేదా? అనేది ఆ రోజునే తెలియనుంది.  


ఈ చిత్రం ఎన్టీఆర్ కొత్త లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కు ప్రముఖ హేర్ స్టైలిష్ట్  అలీమ్ హ‌కీమ్ ప్రత్యేకంగా హెయిర్ స్టైల్ రూపొందిస్తున్నారట. రీసెంట్ గా హకీమ్  షేర్ చేసిన ఫొటోలో ఎన్టీఆర్ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించాడు. కొర‌టాల శివ సినిమా కోస‌మే ఈ లుక్ అని ప్ర‌చారం జరిగింది.


ఇవాళ్టి నుంచి ‘NTR30’ కొత్త షెడ్యూల్ షురూ


‘NTR30’ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూళ్లను కంప్లీట్ చేసుకుంది. ఇవాళ్టి(సోమవారం) నుంచి రామోజీ ఫిల్మ్‌ సిటీలో మరో కొత్త షెడ్యూల్‌ మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో భాగంగా ఎన్టీఆర్‌పై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది (2024) ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది.


తెలుగులో జాన్వీకి తొలి చిత్రమిది!


మరాఠీ సూపర్ హిట్ సినిమా 'సైరాట్' హిందీ రీమేక్ 'ధాకడ్'తో హిందీ చిత్రసీమకు కథానాయికగా పరిచయమైన జాన్వీ కపూర్, ఇప్పటి వరకు అర డజను సినిమాలు చేసింది. తెలుగు తెరకు ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాతో పరిచయం కానుంది. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో హిందీ ప్రేక్షకులనూ ఆమె పలకరించనుంది.  


ఇక కొరటాల శివ సినిమా కంప్లీట్ అయిన తర్వాత, ఎన్టీఆర్ హిందీలో 'వార్ 2' సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. హృతిక్ రోషన్ తో ఢీ అంటే ఢీ కొట్టే పాత్రలో ఆయన కనిపిస్తారట. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ హీరోగా పాన్ ఇండియా సినిమా స్టార్ట్ కానుంది. 


 Read Also: వీకెండ్‌లోనూ అదే పరిస్థితి? ‘కస్టడీ’కి కలెక్షన్స్ కష్టాలు