ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తర్వాతి ప్రాజెక్ట్ చేయనున్నాడు. మరోవైపు కొరటాల శివ.. చిరంజీవి, రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’ రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ఇద్దరి హడావుడి అయిన వెంటనే వచ్చే నెలలో ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని టాక్.




ఈ మూవీలో హీరోయిన్ గా మహేశ్ బ్యూటీ కియారా అద్వానీ నటించబోతోందట. ఎన్టీఆర్ కే కాదు…కియారాకి కూడా కొరటాల శివతో ఇది రెండో మూవీ. గతంలో మహేశ్ బాబుతో భరత్ అనే నేను మూవీలో నటించిన కియారా ఇప్పుడు మళ్లీ కొరటాల సినిమాలో యంగ్ టైగర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. పాన్ ఇండియా సినిమా  కావడంతో బాలీవుడ్ లో ఫాలోయింగ్ ఉన్న కియారా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.




ఈ సినిమా కోసం ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించే సన్నివేశాలుండడంతో దాదాపు 6 నుంచి 7 కేజీల వరకు బరువు తగ్గే పనిలో ఉన్నాడట.ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తైన తర్వాత బరువు తగ్గుతా అని చెప్పడంతో...అప్పటి వరకు కొరటాల శివ.. ఎన్టీఆర్‌తో స్టూడెంట్ లీడర్ కాకుండా వేరే సన్నివేశాలను తెరకెక్కిస్తాడట. సెకండ్ షెడ్యూల్‌లో మాత్రం  స్టూడెంట్ లీడర్‌గా కనిపించే సన్నివేశాలను షూట్ చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. స్టూడెంట్స్ రాజకీయాల్లో పడి వాళ్ల విలువైన జీవితం కోల్పోకూడదనే అమూల్యమైన సందేశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మహేష్ బాబుతో ‘భరత్ అను నేను’ సినిమాను రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించాడు. ఈ సినిమాలో సీఎం కుమారుడు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తే.. ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాను మాత్రం ఒక విద్యార్ధి నాయకుడు రాజకీయాల్లో వచ్చి అంచలంచెలుగా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.





ఈ సినిమాలో పవర్‌ఫుల్ లేడీ పొలిటికల్ లీడర్ పాత్ర ఉందట. ఈ క్యారెక్టర్ కోసం మొదట విజయశాంతిని అనుకున్నా… ఆ తర్వాత శివగామి రమ్యకృష్ణను ఫైనల్ చేసినట్టు టాక్. గతంలో రమ్యకృష్ణ, ఎన్టీఆర్‌తో కలిసి ‘సింహాద్రి’తో ‘నా అల్లుడు’  సినిమాల్లో నటించింది. నరసింహాలో నీలాంబరి తరహా పాత్రలో రమ్యకృష్ణ రోల్‌ను కొరటాల శివ డిజైన్ చేసినట్టు సమాచారం.




అయితే  ‘జనతా గ్యారేజ్’ సినిమాతో రిపేర్లు అన్నీ లోకల్‌లోనే జరిగాయి కానీ ఈ సారి మాత్రం నేషనల్ వైడ్ రిపేర్లు చేయబోతున్నామన్నాడు కొరటాల. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు భారీ మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు.