'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాకు ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' కేటగిరీలో అవార్డు రావడం ఖాయమా? అంటే... మన దేశం ఆ దిశగా అడుగులు వేస్తే ఖాయమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.


ఆస్కార్స్ 2023లో  'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డు అందుకునే అవకాశం ఏయే సినిమాలకు ఉందని ఒక ఆంగ్ల మీడియా సంస్థ అంచనా వేసింది. ఆ ప్రెడిక్షన్స్‌లో 'ఆర్ఆర్ఆర్' కూడా ఉంది. అదే సమయంలో ఇండియాలో ఆస్కార్స్‌కు పంపే సినిమాలపై సూటిగా విమర్శలు చేసింది.


''ఆస్కార్స్‌కు ఇండియా ఎప్పుడూ సరైన సినిమాలను పంపదు. ఈసారి ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్‌ని సొంతం చేసుకునే అవకాశాన్ని కోల్పోకూడదు. డానీ బోయెల్ దర్శకత్వం వహించిన 'స్లమ్ డాగ్ మిలియనీర్'కు ఎనిమిది ఆస్కార్స్ వచ్చినప్పుడు 'ఆర్ఆర్ఆర్'కు ఎందుకు రాకూడదు?'' అని అంతర్జాతీయ సినీ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.


Also Read : పవర్ స్టార్, లేడీ పవర్ స్టార్‌పై 'ప్రస్థానం' డైరెక్టర్ వరుస ట్వీట్లు - అసలు ఏమైందంటే?


'ఆర్ఆర్ఆర్' సినిమాను ఆస్కార్స్ నుంచి తప్పించడం సరి కాదని చెప్పుకొచ్చారు. ఆల్రెడీ 'ఆర్ఆర్ఆర్' సినిమా అంతర్జాతీయ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా హాలీవుడ్ సినిమా దర్శక - రచయితలు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశంసలు చూశాక‌ 'ఆర్ఆర్ఆర్'ను ఇండియన్ సినిమా ఆస్కార్స్ జ్యూరీ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. 


Also Read : తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సభ్యులు జనరల్ బాడీ మీటింగ్‌లో నిర్మాతలు చర్చించబోయే అంశాలు ఇవే