హాలీవుడ్ స్టార్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ మరోసారి పెళ్లిపీటలు ఎక్కడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె వారితో విడిపోయి కొంతకాలంగా నటుడు బెన్ అఫ్లెక్ తో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరికీ సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైనట్లు తెలుస్తోంది. తనకు ఎంగేజ్మెంట్ అయినట్లు జెన్నిఫర్ తన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా తెలిపింది. 


అలానే సీక్రెట్ గా ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. కొంతమంది స్నేహితుల మధ్య జూలై 16న లాస్ వేగాస్ లో జెన్నిఫర్, బెన్ అఫ్లెక్ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా నటీనటులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 


వీరిద్దరూ తమ కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి ఒక కొత్తిల్లు తీసుకోవాలనుకుంటున్నారు. ఫైనల్ గా బెవర్లీ హిల్స్‌లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. 52 ఏళ్ల జెన్నిఫర్ లోపెజ్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ వయసులో ఆమె మరో పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకోవడం విశేషం. 


Also Read: శ్రీనువైట్లకు షాక్ - విడాకులకు అప్లై చేసిన భార్య!


Also Read: రామ్ చరణ్ సినిమాతో శంకర్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?