NTR Hrithik About Trending Hashtag On War 2 Movie: ఒకరు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. మరొకరు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్. ఇద్దరి మధ్య వార్, భారీ యాక్షన్ సీక్వెన్స్ అంటే ఇక థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో టీం బిజీగా ఉండగా... ఎన్టీఆర్, హృతిక్ సోషల్ మీడియాలోనూ ఫన్నీగా ట్రెండింగ్ ట్యాగ్ వార్ క్రియేట్ చేశారు.

వార్ ఇప్పుడే స్టార్ట్

ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ #NTRvshrithik, #Hrithikvsntr హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై ఇద్దరు స్టార్స్ కూడా ఫన్నీగా సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. తొలుత హృతిక్ రోషన్... 'యుద్ధ రేఖలు మళ్లీ గీయబడ్డాయి. హ్యాష్ ట్యాగ్ అన్నీ చెబుతుంది. ప్రతీ అప్డేట్, రివీల్ కోసం #Htithikvsntrతో ఉండండి.' అంటూ ట్వీట్ చేశారు.

దీనికి రియాక్ట్ అయిన ఎన్టీఆర్... 'హే హృతిక్ సర్... మనం దీని గురించి మాట్లాడాం. ఫాలో అవ్వడానికి ఒకే ఒక హ్యాష్ ట్యాగ్ ఉంది. #NTRvshrithik. ఈ యుద్ధం ఇప్పుడే ప్రారంభం కానుంది. కాబట్టి ఈ హ్యాష్ ట్యాగ్‌నే వాడాలి.' అంటూ రిప్లై ఇచ్చారు.

కాంప్లికేట్ వద్దు... ఓకేనా...

ఎన్టీఆర్ ట్వీట్‌కు స్పందించిన హృతిక్... 'హాహా బాగుంది తారక్!. కానీ హ్యాష్ ట్యాగ్ #HrithikvsNTR నే వాడాలి. దీన్ని కాంప్లికేట్ చెయ్యొద్దు. సరేనా?.' అంటూ ఓ ఫన్నీ ఎమోజీతో ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఎన్టీఆర్... 'నేను చెప్పేది బాగుందని మీరన్నారు అంటే నేను గెలిచినట్లే.. హృతిక్ సర్.' అంటూ ఓ ఎమోజీని పోస్ట్ చేశారు. వీటిని చూసిన నెటిజన్లు ఇద్దరి మధ్య మూవీలోనే కాదు సోషల్ మీడియాలోనూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ వార్ నడుస్తోందంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: పాక్ క్రికెటర్‌తో పెళ్లి... ఇండియన్ క్రికెటర్‌‌తో రిలేషన్ షిప్ రూమర్స్ - మిల్కీ బ్యూటీ తమన్నా రియాక్షన్ ఇదే

ఎన్టీఆర్‌కు ఇది ఫస్ట్ బాలీవుడ్ మూవీ కాగా... సిల్వర్ స్క్రీన్‌పై ఇద్దరు స్టార్స్ వార్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'వార్ 2' ప్రమోషన్స్ సైతం వెరైటీగా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. చాలా రోజుల తర్వాత ఈ మూవీలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌లో కనిపించడం ఇంట్రెస్ట్ అమాంతం పెంచేసింది.

2019లో వచ్చిన వార్‌కు సీక్వెల్‌గా యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఆరో మూవీగా 'వార్ 2' రాబోతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా... కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ నెల 14న హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.