మ్యాన్ ఆఫ్ మాసెస్, పాన్ ఇండియా లెవల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎన్టీఆర్ (NTR). ఆయన నటించిన ఫస్ట్ హిందీ సినిమా 'వార్ 2' (War 2 Movie). ఇందులో హృతిక్ రోషన్ (Hrithik Roshan) మరో హీరో. వాళ్ళిద్దరిపై ఒక డ్యాన్స్ నంబర్ షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ రిలీజ్ కోసం 'కజ్రా రే', 'ధూమ్ 3' స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు ప్రముఖ నిర్మాత - దర్శకుడు ఆదిత్య చోప్రా.

'వార్ 2' కోసం 'ధూమ్ 3' స్ట్రాటజీ'వార్ 2'ను యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఫిల్మ్ ఇది. 'ధూమ్ 3' సినిమానూ యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసింది. ఆదిత్య చోప్రా నిర్మాత. 

NTR - Hrithik Roshan song glimpse: 'వార్ 2' కోసం తాను నిర్మించిన సినిమాల్లో 'బంటీ ఔర్ బబ్లీ', 'ధూమ్ 3' రేంజ్‌లో మ్యూజికల్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. 'వార్ 2' నుంచి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ డ్యాన్స్ సాంగ్‌కు సంబంధించిన గ్లింప్స్‌ ఈ వారంలో విడుదల చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద ఫ్యాన్స్, ఆడియన్స్ వాళ్ళిద్దరి డ్యాన్స్ చూసి అనిర్విచనీయమైన అనుభూతి పొందేందుకు ఈ గ్లింప్స్ ఎంతో హెల్ప్ అవుతుందని టీం భావిస్తోంది.  

'వార్ 2' టీజర్, ట్రైలర్ తెలుగు ప్రేక్షకులకూ నచ్చాయి. హృతిక్ రోషన్, కియారా అద్వానీ మీద తెరకెక్కించిన పాటకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మంచి స్పందన లభించింది. అయితే ఆడియన్స్ అందరూ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అది నిర్మాత ఆదిత్య చోప్రాకు కూడా తెలుసు. ఈ పాట హైప్‌ మరింత పెంచేలా ఆయన ప్లాన్ చేశారు. అందుకని మిగతా బాలీవుడ్ సినిమాల తరహాలో యూట్యూబ్‌లో సాంగ్ విడుదల చేయాలని ఆదిత్య చోప్రా అనుకోవడం లేదు. కేవలం గ్లింప్స్‌ విడుదల చేస్తే ఫుల్ సాంగ్ సిల్వర్ స్క్రీన్ మీద చూడటానికి ఆడియన్స్ వస్తారని భావిస్తున్నారు.

Also Readనన్ను రాజకీయాల్లోకి లాగొద్దు... నేను రియాక్ట్ కాను... జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై చిరంజీవి క్లారిటీ?

'బంటీ ఔర్ బబ్లీ' సినిమాలో 'కజ్రా రే' పాటతో పాటు 'ధూమ్ 3'లో పాటలు అన్నిటినీ సిల్వర్ స్క్రీన్‌ మీద చూపించారు. 'ధూమ్ 3'లో కత్రినా కైఫ్ మీద తెరకెక్కించిన 'కంమ్లీ' పాటకు థియేటర్లలో రెస్పాన్స్ బావుంది. అంతకు మించి ఎన్టీఆర్ - హృతిక్ డ్యాన్స్ నంబర్ హిట్ అవుతుందని యష్ రాజ్ ఫిలిమ్స్ వర్గాలు భావిస్తున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'వార్ 2' ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.

Also Readఎవరీ వెంకటేష్ నాయుడు? ఆయనతో తమన్నాకు సంబంధం ఏమిటి? గోల్డ్ - లిక్కర్ స్కాంలో మిల్కీ బ్యూటీ