NTR: 'క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు కన్నీళ్లు ఆగవు' - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' స్పెషల్ మూవీ అవుతుందన్న ఎన్టీఆర్.. 'వార్ 2'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Arjun Son Of Vyjayanthi: విజయశాంతి గారు మాట్లాడుతుంటే నాన్న గారు లేని లోటు తీరినట్లు అనిపించిందని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్నారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్‌‍లో ఆయన మాట్లాడారు.

Continues below advertisement

NTR About Arjun Son Of Vyjayanthi In Pre Release Event: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' (Arjun Son Of Vyjayanthi) సినిమాలో చివరి 20 నిమిషాలు ప్రేక్షకులకు కన్నీళ్లు ఆగవని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) అన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Continues below advertisement

మా అన్న కెరీర్‌లోనే స్పెషల్

'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ కల్యాణ్ రామ్ (Kalyan Ram) కెరీర్‌లోనే చాలా స్పెషల్ అని ఎన్టీఆర్ అన్నారు. 'కర్తవ్యం' సినిమాలో పోలీస్ ఆఫీసర్‌కు కొడుకు పుడితే ఎలా ఉంటుందన్న ఐడియాతోనే ఈ స్టోరీ ఆలోచన వచ్చిందేమో అని తెలిపారు. 'ఈ సినిమా కథను అన్నతో పాటు ముఖ్యంగా ప్రదీప్ చిలుకూరి, నిర్మాతలు ఎంతో నమ్మారు. క్లైమాక్ష్ సీన్ అద్భుతంగా మలిచారు. విజయశాంతి, పృథ్వి, సోహైల్ ఖాన్ లేకపోతే ఈ మూవీ లేదు.' అని పేర్కొన్నారు.

'మా నాన్న లేని లోటు తీరినట్లు అనిపించింది'

వేదికపై విజయశాంతి గారు మాట్లాడుతుంటే మా నాన్న లేని లోటు తీరినట్లు అనిపించిందని ఎన్టీఆర్ అన్నారు. 'ఈ వేదికపై నేను, అన్న ఉన్నప్పుడు నాన్న చాలాసార్లు మాట్లాడారు. విజయశాంతి గారి వల్ల ఆయన లేని లోటు తీరినట్లు అనిపించింది. చాలామంది హీరోలు చాలా సాధించారు. కానీ, వాళ్లకు దీటుగా సినిమా ఇండస్ట్రీలో నిలిచిన మహిళ విజయశాంతి గారు. ఆమె చేసిన సినిమాలు మరో హీరోయిన్ చేయలేదు.' అని ప్రశంసించారు.

Also Read: ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దంటే ఎలా? - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ అదుర్స్

'వార్ 2' సినిమాపై

ఈ సందర్భంగా 'వార్ 2' సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్. 'ఆగస్టులో 'వార్ 2' రాబోతోంది. ఆ సినిమా బాగా వచ్చింది. మరిన్ని విషయాలు త్వరలో మాట్లాడుకుందా. ఈ జన్మ అభిమానులకు అంకితం. ఈ ఏడాది మిమ్మల్ని కలుస్తాను.' అని చెప్పారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుండగా.. సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్ర పోషించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ 'రా' ఏజెంట్‌గా డిఫరెంట్ రోల్‌లో చేయనున్నట్లు తెలుస్తోంది.

వీరిద్దరూ రామ లక్ష్మణులు

కల్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లను చూస్తే రామలక్ష్మణుల్లా ఉన్నారని.. ఇద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలని లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijaya Shanti) అన్నారు. 'సీనియర్ ఎన్టీఆర్ అంటే మాకు ఎంతో గౌరవం. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అలాగే, జూనియర్ ఎన్టీఆర్ సైతం అద్భుతంగా నటిస్తారు. కల్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లను ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారు. భవిష్యత్తులో ఇంకా గొప్ప సినిమాలు చేయాలి. ఈ సినిమా కోసం కల్యాణ్ రామ్ ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. అందువల్లే నా రోల్ బాగా చేయగలిగా. వారికి నా ధన్యవాదాలు.' అని విజయశాంతి అన్నారు.

ఈ సినిమా మనసును హత్తుకుంటుందని.. విజయోత్సవ కార్యక్రమంలోనే తాను మాట్లాడతానని హీరో నందమూరి కల్యాణ్ రామ్ అన్నారు. కల్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకుల్లా నటించిన మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించారు.

అభిమానులపై ఎన్టీఆర్ అసహనం

ఈవెంట్‌లో కల్యాణ్ రామ్‌తో కలిసి ఎన్టీఆర్ స్టేజీపైకి వెళ్లారు. ఇదే సమయంలో విజయశాంతి మాట్లాడుతుండగా.. అభిమానులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. మీరు ఇలాగే ప్రవర్తిస్తే వెళ్లిపోతానంటూ ఎన్టీఆర్ వారిపై అసహనం ప్రదర్శించారు. అభిమానులు సైలెంట్‌గా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Continues below advertisement