Aishwaryarai Bachchan Abhishek Bachchan 18th Marriage Anniversary: బాలీవుడ్ లవ్లీ కపుల్ అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), ఐశ్వర్యారాయ్ (Aishwaryarai).. వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొత్త ఫోటోను షేర్ చేశారు. ఈ జంట ఆదివారం తమ 18వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నారు. ఒకే ఫ్రేమ్‌లో తమ ముద్దుల కూతురు ఆరాధ్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేయగా వైరల్ అవుతోంది.

క్యూట్ ఫ్యామిలీ..

ఐశ్వర్య క్లిక్ చేసిన సెల్ఫీలో అభిషేక్ బచ్చన్.. ఆరాధ్య, ఐశ్వర్యను పట్టుకుని నవ్వుతూ సందడి చేశారు. తెల్లటి దుస్తుల్లో ఉన్న ముగ్గురి ఫోటోతో పాటు 'లవ్ సింబల్' ఎమోజీని ఐశ్వర్యారాయ్ ఇన్ స్టా వేదికగా షేర్ చేయగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన అభిమానులు వాట్ ఏ క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చాలాకాలం తర్వాత ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడడం ఆనందంగా ఉందంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఏప్రిల్ 20, 2007న వివాహం చేసుకున్నారు. 2011లో వీరికి ఆరాధ్య జన్మించారు. 

విడాకుల రూమర్స్‌కు ఫుల్ చెక్

ఈ ఫోటోతో వీరిద్దరి విడాకుల రూమర్స్‌కు పూర్తిగా చెక్ పడినట్లైంది. గతంలో చాలా సందర్భాల్లో ఐశ్వర్య, అభిషేక్ విడిపోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. పలు కార్యక్రమాల్లో నటుడు అభిషేక్ బచ్చన్ ఈ రూమర్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా సోషల్ మీడియాలో ఎక్కడో ఓ చోట వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వస్తూనే ఉండేవి. గత కొంతకాలంగా ఈ రూమర్లకు కాస్త బ్రేక్ పడినా.. గతంలో మాత్రం ఈ వార్తలు ట్రెండింగ్‌గా మారాయి. 

ఐశ్వర్యా రాయ్ సైతం గతంలో ప్రత్యేక సందర్భాల్లో పలు ఫోటోలు షేర్ చేస్తూ ఈ రూమర్స్‌పై ఇండైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చారు. తాము కలిసే ఉన్నామంటూ స్పష్టం చేశారు. అయినా సరే రూమర్స్ ఆగలేదు. తాజాగా వివాహ వార్షికోత్సవం సందర్భంగా ముగ్గురూ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేయగా ఫ్యాన్స్‌ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇద్దరికీ విషెష్ చెప్పడమే కాకుండా.. 'ఈ పోస్ట్ అన్ని విడాకుల రూమర్లను తుడిచిపెడుతుంది' అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: కామెడీ నుంచి లవ్ స్టోరీస్ వరకూ చూసేందుకు రెడీయేనా! - ఈ వారం మూవీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసే చిత్రాలివే!

తాజా సినిమాలివే!

ఇక సినిమాల విషయానికొస్తే.. అభిషేక్ బచ్చన్.. రెమో డిసౌజా దర్శకత్వంలో 'బి హ్యాపీ' చిత్రంలో కనిపించారు. ఇనాయత్ వర్మ, నోరా ఫతేహి, నాజర్, జానీ లివర్, హర్లీన్ సేథి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ మార్చి 14న అమెజాన్  ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కూతురు కోసం ఓ తండ్రి చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.

ఆ తర్వాత 'హౌస్ ఫుల్ 5' మూవీలో నటించనున్నారు. ఈ సినిమా జూన్ 6న రిలీజ్ కానుంది. తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించిన ఈ కామెడీ చిత్రంలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, ఫర్దీన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నర్గీస్ ఫక్రీ, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, చంకీ పాండే, జానీ లివర్, శ్రేయాస్ తల్పాడేలతో కలిసి నటించనున్నారు. డినో మోరియా, చిత్రాంగద సింగ్, రంజీత్, సౌందర్య శర్మ, నికితిన్ ధీర్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఐశ్వర్యరాయ్.. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో చివరిసారిగా నటించారు.