ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాలో 'మనోహరి, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'టెంపర్' సినిమాలో 'ఇట్టాగే రెచ్చిపోదాం' వంటి ఐటమ్ సాంగ్స్ చేసిన అందాల భామ నోరా ఫతేహి గుర్తు ఉన్నారా? తెలుగులో 'కిక్ 2', 'లోఫర్', 'ఊపిరి' సినిమాల్లోనూ స్పెషల్ సాంగ్స్ చేశారు. ఇప్పుడు ఆవిడ ప్రస్తావన ఎందుకంటే? ముంబైలోని అంబోలిలోని లింక్ రోడ్ సమీపంలో నోరా ఫతేహి కారుకు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీసులు వినయ్ సక్పాల్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, నోరా ప్రయాణిస్తున్న కారును వినయ్ ఢీ కొట్టాడట. వినయ్ మద్యం మత్తులో ఉన్నాడని అనుమానిస్తున్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. సన్‌ బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి నోరా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Continues below advertisement

నోరా ఫతేహి హెల్త్ అప్‌డేట్

ప్రమాదం జరిగిన తర్వాత నోరా ఫతేహి తన ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్ ఇచ్చారు. ఇన్‌స్టా స్టోరీలో వీడియో షేర్ చేశారు. "హలో... నేను బాగానే ఉన్నాను. ఈ రోజు నా కారుకు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి నా కారును ఢీ కొట్టాడు. దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదంలో నేను కారులో తీవ్రంగా కదిలిపోయాను. నా తల డోర్‌కు తగిలింది" అని నోరా రాశారు.

Continues below advertisement

Also Read: అందంలో ఐశ్వర్యతో పోటీ పడే బ్యూటీ... 120 కోట్లకు అధినేత్రి... ఒక్కో యాడ్, సినిమాకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

నోరా ఫతేహి ఇంకా మాట్లాడుతూ "నేను బతికే ఉన్నాను, బాగానే ఉన్నాను. నాకు చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. కొంచెం వాపు ఉంది. కానీ నేను బాగానే ఉన్నాను. నేను చాలా కృతజ్ఞురాలిని. అందుకే మద్యం సేవించి వాహనం నడపకూడదని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నిజానికి నాకు మద్యం అంటే అసహ్యం" అని అన్నారు.

మద్యం అంటే నోరాకు అసహ్యం

అంతే కాకుండా నోరా మద్యం గురించి కూడా మాట్లాడారు. లిక్కర్ గురించి ఆమె మాట్లాడుతూ "నిజం చెప్పాలంటే, నాకు ఎప్పుడూ మద్యం లేదా డ్రగ్స్, గంజాయి వంటివి ఇష్టం లేదు. అవి మిమ్మల్ని మానసికంగా వేరే స్థితికి తీసుకెళ్తాయి. నేను వాటిని ప్రోత్సహించను. అలాంటి వాటి దగ్గర ఉండటం కూడా నాకు ఇష్టం ఉండదు. మీరు మద్యం సేవించి వాహనం నడపకూడదు. ఇది 2025, నేను దీని గురించి మాట్లాడాల్సి వస్తోంది" అని అన్నారు.

Also Read: Year Ender 2025: యాక్టింగ్ చింపేశారుగా... ధృవ్ విక్రమ్ to రుక్మిణి, కల్యాణీ - 2025లో సర్‌ప్రైజ్ చేసిన సౌత్ స్టార్లు