Aadi Sai Kumar's Shambhala Trailer Out Now : టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) లేటెస్ట్ సూపర్ నేచరల్ థ్రిల్లర్ 'శంబాల'. ఇదివరకూ ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. మూవీ ప్రమోషన్లలో భాగంగా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Continues below advertisement

సైన్స్ Vs శాస్త్రం

సైన్స్‌కు శాస్త్రానికి మధ్య జరిగే సంఘర్షణే 'శంబాల' (Shambhala) మూవీ అని తెలుస్తోంది. 'పంచభూతాల్నే శాసిస్తుందంటే ఇది సాధారణమైంది కాదు' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆసక్తి పెంచేసింది. ఆకాశం నుంచి ఓ గ్రామంలో పడ్డ భారీ ఉల్క. దాని ప్రభావంతో ఊరిలో వింతగా ప్రవర్తించే గ్రామస్థులు. వరుస హత్యలు, క్షుద్రపూజలు... ఊరి గుడిలో అభిషేకాలు, ఏం జురుగుతుందో తెలియని సస్పెన్స్. 

Continues below advertisement

మూవీలో జియో సైంటిస్ట్ విక్రమ్‌గా ఆది కనిపించబోతున్నారు. దేవున్ని నమ్మని ఈ సైంటిస్ట్ ఆ ఊరి సమస్యను ఎలా తీర్చాడు? అసలు ఆ ఊరిలో ఉన్నది దెయ్యమా? లేక మానవ ఊహకు అందని సైన్సా? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

Also Read : 'ది రాజా సాబ్' ఓటీటీ డీల్ - ఊహించిన దాని కంటే తక్కువే... ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ రియాక్షన్

మూవీలో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. అలాగే, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 25న తెలుగుతో పాటు హిందీ భాషలో మూవీ రిలీజ్ కానుంది. చాలా రోజుల తర్వాత ఆది సాయికుమార్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఆయన కెరీర్‌లో ఇది బెస్ట్ మూవీగా నిలవడం ఖాయమంటూ కామెంట్స్ వస్తున్నాయి.