Producer Reaction About Prabhas's The Raja Saab Theatrical Business : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అవెయిటెడ్ హారర్ కామెడీ థ్రిల్లర్ 'ది రాజా సాబ్'. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న వరల్డ్ వైడ్‌గా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా... అప్పుడే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్‌పై రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ ఓటీటీ డీల్ ఫిక్స్ అయ్యిందని ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ చెప్పారు. నాన్ థియేట్రికల్ బిజినెస్ తాము ఊహించిన దాని కంటే తక్కువగా జరిగాయని ఆయన చెప్పగా దీనిపై అప్పుడే సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. ఓటీటీ డీల్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ అంచనాలు అందుకోలేకపోయిందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై విశ్వ ప్రసాద్ రియాక్ట్ అయ్యారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Also Read : 'శంబాల' నుంచి 'పదే పదే' సాంగ్ - లిరిక్స్‌లోనే స్టోరీ రివీల్ చేశారా?... మనసును హత్తుకునే పాట
'స్క్రీన్స్ మాట్లాడతాయ్'
మా అతి పెద్ద సినిమా 'ది రాజా సాబ్' బిజినెస్ గురించి సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వస్తున్నాయని ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ తెలిపారు. 'మేము నాన్ థియేట్రికల్, థియేట్రికల్ బిజినెస్, అంతర్గత బడ్జెట్, ఖర్చుల గురించి బహిరంగంగా చర్చించం. మాకు, ఫ్యాన్స్‌కు నిజంగా థియేటర్ ప్రభావం చాలా ముఖ్యం. మూవీ రిలీజ్ తర్వాత మేమే అధికారికంగా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ గణాంకాలను పంచుకుంటాం. సినిమా రంగం దశలవారీగా మారుతుంది.
ఈ రోజుల్లో నాన్ థియేట్రికల్ బిజినెస్ మార్కెట్‌లో సాధారణంగా సర్దుబాట్లు జరుగుతుంటాయి. థియేటర్స్ మాత్రం నిజమైన తీర్పును అందిస్తూనే ఉన్నాయి. అసలైన నెంబర్స్ అక్కడే వస్తాయి. అయినప్పటికీ కూడా ఈ రోజు మా సినిమా అత్యధిక నాన్ థియేట్రికల్ విలువను పొందింది. 'ది రాజా సాబ్'కు పోలికలు అనవసరం. ఇది థియేటర్లలో గర్జించడానికి రూపొందించబడిన భారీ హారర్ ఫాంటసీ. స్క్రీన్స్‌ను మాట్లాడనివ్వండి.' అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రబాస్!
నిజానికి ప్రభాస్ బహిరంగంగా ఈవెంట్లలో కనిపించి చాలా కాలమే అయ్యింది. తాజాగా 'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన వస్తారని తెలుస్తోంది. హైదరాబాద్‌లో LB స్టేడియంలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే సరికొత్త ట్రైలర్‌ను సైతం రిలీజ్ చేయనున్నారు. ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
మారుతి దర్శకత్వం వహిస్తుండగా... ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటే బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్, సప్తగిరి, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా... పాన్ ఇండియా స్థాయిలో జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన డార్లింగ్ వింటేజ్ లుక్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అదిరిపోయాయి.