అవినాష్ తిరువీధుల (Avinash Thiruveedhula) కథానాయకుడిగా, దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'వానర' (Vanara Movie). ఇందులో సిమ్రాన్ చౌదరి (Simran Choudhary) కథానాయికగా నటించారు. యంగ్ హీరో, ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ ఖరారు అయ్యింది.
జనవరి 1న థియేటర్లలోకి 'వానర'Vanara Movie Release Date: 'వానర' చిత్రాన్ని జనవరి 1వ తేదీన థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ పతాకంపై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు.
మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో 'వానర' తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచింది. ఆల్రెడీ రెండు మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఇటీవల సినిమాలో మొదటి పాట 'అదరహో...' శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి.
Vanara Movie Cast And Crew: అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి జంటగా... నందు, 'ఖడ్గం' పృథ్వీ, కోన వెంకట్, సత్య, ఆమని, శివాజీ రాజా, 'చమ్మక్' చంద్ర, 'రచ్చ' రవి తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, ఛాయాగ్రహణం: సుజాత సిద్ధార్థ్, సంగీతం: వివేక్ సాగర్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కథ - కథనం: విశ్వజిత్, సమర్పణ - శంతను పత్తి, నిర్మాణ సంస్థలు: సిల్వర్ స్క్రీన్ సినిమాస్, నిర్మాతలు: అవినాష్ బుయానీ - ఆలపాటి రాజా - సి. అంకిత్ రెడ్డి, దర్శకుడు: అవినాష్ తిరువీధుల.