అందంలో ఐశ్వర్యతో పోటీ పడే మిల్కీ బ్యూటీ... 120 కోట్లకు అధినేత్రి... ఒక్కో యాడ్, సినిమాకు ఎంత తీసుకుంటుందో తెలుసా?
తెలుగు సినిమా 'శ్రీ'తో తమన్నా భాటియా 2006లో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసింది. అదే ఏడాది ఆమె తమిళ సినిమా 'కేడి' కూడా చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించినప్పటికీ... తరువాత కష్టం, ప్రతిభతో కేవలం దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది తమన్నా.
'బాహుబలి' వంటి సినిమాలలో తన నటనతో తమన్నా ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
బాలీవుడ్ సినిమాల్లో తమన్నా తక్కువగా కనిపించినప్పటికీ, సౌత్ సినిమాల్లో ఆమె పెద్ద స్టార్. దర్శకుల నుండి హీరోల వరకు ఆమెతో సినిమాలు చేయడానికి చాలా మంది ఆసక్తిగా ఉన్నారు.
'వా నువ్ కావాలయ్యా', 'అచ్చచ్చో', 'ఆజ్ కి రాత్', 'నషా', 'టాకీ టాకీ', 'పియా కే బజార్' వంటి స్పెషల్ సాంగ్స్ చేశారు తమన్నా. ఆమె డ్యాన్స్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.
GQ రిపోర్ట్ ప్రకారం తమన్నా ఆస్తి విలువ 120 కోట్లకు అధిపతి. ఆమె ఒక్కో సినిమాకు 4 - 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది.
'బాహుబలి 2' సినిమా కోసం తమన్నా రూ. 5 కోట్లు తీసుకుందని ఓ నేషనల్ మీడియా తెలిపింది.
తమన్నా భాటియా ఒక యాడ్ ప్రమోషన్ కోసం 7-8 కోట్ల రూపాయలు తీసుకుంటుందని టాక్.
రెడ్ కార్పెట్ నుండి సాధారణ సమావేశాల వరకు తమన్నా ప్రతి సందర్భంలోనూ స్టైలిష్ గా, ట్రెండీగా కనిపిస్తారు. తమన్నా దుస్తులు ఎల్లప్పుడూ ఫ్యాషన్ ట్రెండ్ కు అనుగుణంగా ఉంటాయి.