Arin Nene: ఎవరీ ఆరిన్? యాపిల్ కంపెనీలో పని చేస్తున్న హీరోయిన్ కుమారుడు... ఫ్యామిలీ ఫోటోలు చూడండి
మాధురీ దీక్షిత్ అక్టోబర్ 17, 1999న డాక్టర్ శ్రీరామ్ నేనేను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
మాధురి పెద్ద కుమారుడు ఆరిన్ 2003లో జన్మించారు. రయాన్ 2005లో జన్మించారు.
మాధురి కుమారులు ఆరిన్, రయాన్ ఎల్లప్పుడూ సినిమా ప్రపంచానికి దూరంగా ఉంటారు. తల్లి బాలీవుడ్ స్టార్ అయినప్పటికీ... పిల్లలకు మాత్రం సాధారణ జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతుంది.
ఆరిన్, రయాన్ చదువుల్లో టాప్ అని చెప్పాలి. ఆరిన్ ఈ సంవత్సరం మే నెలలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. రయాన్ ఇంకా కాలేజీలో ఉన్నాడు.
ఆరిన్ గురించిచెప్పాలంటే లాస్ ఏంజిల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (USC) నుండి కంప్యూటర్ సైన్స్ & బిజినెస్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేశారు.
ఆరిన్ కు డాన్స్ & మ్యూజిక్ అంటే ఇష్టం. చిన్న వయసు నుంచే కథక్ & క్లాసికల్ డాన్స్ ట్రై చేశారు. తల్లి మాధురి దగ్గర డాన్స్ మెళకువలు నేర్చుకున్నారు.
ఇటీవల మాధురి దీక్షిత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెద్ద కుమారుడు ఆరిన్ ఆపిల్ లో పనిచేస్తున్నాడని, అక్కడ అతను నాయిస్ క్యాన్సిలేషన్ సంబంధిత ప్రాజెక్టులలో నిమగ్నమయ్యాడని చెప్పారు.
తన పెద్ద కుమారుడికి సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ కోరిక అని మాధురి దీక్షిత్ చెప్పింది.
ఆరిన్ నేనేకి సంగీతం అన్నా ఇష్టమేనట.
స్కూల్ లో కూడా సంగీతాన్ని మైనర్‌గా, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌ను మేజర్‌గా తీసుకున్నాడట ఆరిన్ నేనే.