టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో తన కొత్త చిత్రం 'రాబిన్ హుడ్'తో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నారు. గతంలో వెంకి కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా చేసిన 'భీష్మ' మూవీ సూపర్ హిట్ అయింది. 'రాబిన్ హుడ్'తో అదే కాంబో రిపీట్ అవుతుండడంతో నితిన్ ఖాతాలో ఈసారి సక్సెస్ పడడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ కొన్నాళ్ల నుంచి ఈ మూవీ పోస్ట్ పోన్ కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు 'రాబిన్ హుడ్' సినిమా పోస్ట్ పోన్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. 


'రాబిన్ హుడ్' మూవీ పోస్ట్ పోన్


నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'రాబిన్ హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తాజాగా పలు అనివార్య కారణాల వల్ల 'రాబిన్ హుడ్' మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కావట్లేదని, కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తామని చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే పండగ సీజన్ తో పాటు వీకెండ్ కూడా కలిసి వస్తుంది. పైగా ఆ టైమ్ లో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావట్లేదు. కాబట్టి హిట్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం 'పుష్ప 2' మూవీ ఫీవర్ నడుస్తుండడంతో పాటు, ఇంకా 'రాబిన్ హుడ్' సినిమా వర్క్ పెండింగ్లో ఉండడంతో సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. 






సంక్రాంతి కానుకగా 'రాబిన్ హుడ్' 


అయితే ప్రస్తుతానికి చిత్ర బృందం 'రాబిన్ హుడ్' సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటికే సంక్రాంతి రేసులో మూడు సినిమాలు రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' జనవరి 10న, బాలయ్య 'డాకు మహారాజ్' జనవరి 12న, వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా జనవరి 14న రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా 'రాబిన్ హుడ్' మూవీని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంక్రాంతి రేసులో అజిత్ తో తీసిన 'గుడ్ బాడ్ అగ్లీ' మూవీని దించాలనుకున్నారు. కానీ ఆ మూవీ పోస్ట్ పోన్ కావడంతో ఇప్పుడు 'రాబిన్ హుడ్'ను సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది.



క్రిస్మస్ కు సందడి చేయనున్న సినిమాలు... 


ఇక ఇప్పుడు నితిన్ 'రాబిన్ హుడ్' సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ తో క్రిస్మస్ బరిలో నుంచి అధికారికంగా తప్పుకున్నట్టుగా అయ్యింది. అయినప్పటికీ ఈ సంక్రాంతికి రెండు తెలుగు సినిమాలతో పాటు మరో రెండు డబ్బింగ్ సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అల్లరి నరేష్ హీరోగా నటించిన 'బచ్చల మల్లి', ప్రియదర్శి 'సారంగపాణి జాతకం', విజయ్ సేతుపతి 'విడుదల 2', ఉపేంద్ర 'యుఐ' సినిమాలు డిసెంబర్ 20న రిలీజ్ కాబోతున్నాయి.