తెలుగులో ట్యాలెంటెడ్, ప్రామిసింగ్ హీరోయిన్ అనిపించుకున్న లిస్టులో అందాల భామ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఉన్నారు. అయితే... 'హరి హర వీరమల్లు', 'ది రాజా సాబ్' సినిమాల కోసం ఐదేళ్ల తన ప్రైమ్ టైమ్ కేటాయించారు. ఇప్పుడు ఆ రెండు సినిమాలు విడుదలకు దగ్గరలో ఉన్నాయి. 'హరి హర వీరమల్లు' ఈ నెల 24వ తేదీన విడుదల అవుతోంది. ఆ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
డూప్ కాదు... రియల్ ప్రభాస్, నేను నటించా!Nidhhi Agerwal On Prabhas: 'ది రాజా సాబ్'లో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్... ముగ్గురు ఉన్నారు. ఇటీవల సినిమా యూనిట్ విడుదల చేసిన గ్లింప్స్ చూస్తే ముగ్గురూ కనిపించారు. మాళవికా మోహనన్ స్టంట్స్ చేసినట్టు కనిపించింది. రిద్ధి కుమార్, ప్రభాస్ మధ్య లవ్ ట్రాక్ హైలైట్ అయ్యింది.
వీరమల్లు విడుదల నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ''ఇండస్ట్రీలో హీరోలు అందరూ స్టంట్స్ చేసేటప్పుడు డూప్స్ వాడతారు. కానీ, 'ది రాజా సాబ్'లో ఎక్కువ యాక్షన్ సీన్లు లేవు. ప్రభాస్, నాకు మధ్య ఎక్కువ లవ్ సీన్స్ ఉన్నాయి. అందువల్ల నేను డూప్‌తో కాకుండా రియల్ ప్రభాస్ గారితో నటించాను'' అని నిధి అగర్వాల్ తెలిపారు. ప్రభాస్ చెప్పిన డైలాగులు ఫ్యాన్స్, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని ఆవిడ తెలిపారు.
Also Read: పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా... వంద సినిమాలతో సమానం - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ
'హరి హర వీరమల్లు' జూలై 24న విడుదల అవుతుంటే... డిసెంబర్ 5వ తేదీన 'ది రాజా సాబ్' రిలీజ్ అవుతోంది. వీరమల్లు విడుదల అయ్యే వరకు మరో సినిమా చేయకూడదని నిర్మాతలు కండిషన్ పెట్టారు. అందుకు నిధి అగర్వాల్ ఓకే అనడంతో ఇన్నాళ్లూ మరో సినిమా చేయలేదు. నిజానికి ఆ అగ్రిమెంట్ చేసే టైంలో ఐదేళ్లు పడుతుందని నిధి అగర్వాల్ కూడా అనుకోలేదు. ఇక మీదట అటువంటి అగ్రిమెంట్ చేయనని ఆవిడ చెబుతున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత మరిన్ని ఎక్కువ సినిమాలు చేయాలని ఆవిడ డిసైడ్ అయ్యారు.
Also Read: నదివే వర్సెస్ నీవే... అదే మ్యూజిక్కు - అవే స్టెప్పులు... రష్మిక కొత్త సినిమాలో పాట కాపీయేనా!?