Anushka Sharma Shared her Crime Partner Video: బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ఇటీవల రెండోసారి తల్లైన సంగతి తెలిసిందే. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె కుమారుడికి అకాయ్‌ని నామకరణం చేసినట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉండి పిల్లల బాధ్యతను తీసుకుంది. ప్రస్తుతం యాక్టింగ్‌కి‌ షార్ట్‌ బ్రేక్‌ ఇచ్చింది. కానీ, సోషల్‌ మీడియాలో మాత్రం తరచూ పోస్ట్స్‌ షేర్‌ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా అనుష్క ఓ వీడియో షేర్‌ చేసింది. ఇందులో అనుష్క తన క్రైం పార్ట్‌నర్‌ని పరిచయం చేసింది. అనుష్క వన్‌ప్లస్‌ మొబైల్‌ కమర్షియల్‌ యాడ్‌లో నటించింది. దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో బాగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో అనుష్క కుక్క పిల్లలను తన ఫోన్లో క్లిక్‌ మనిపించింది. ఇందులో బాస్‌ లేడీలా కోట్‌ వేసి కనిపించింది.


దీనికి అనుష్క ఇలా క్యాప్షన్‌ ఇచ్చింది. "మై ఫెవరేట్‌ క్రైం పార్ట్‌నర్‌ను కలిసే సమయం ఇది. మీకు అర్థమవుతుందా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. ఈ క్యూటీ గురించా? వన్‌ ప్లస్‌ గురించా?" అంటూ డైలామాలో పడేసింది. కాగా అనుష్క ఈ వన్‌ ప్లస్‌ యాడ్‌కు సంబంధించిన ఇటీవల ఓ పోస్ట్‌ కూడా చేసింది. కాగా గత ఫిబ్రవరిలో అనుష్క-విరాట్‌ కోహ్లి దంపతులుకు రెండో బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టిన చాలా రోజులకు అనుష్క దంపతులుమ మగబిడ్డ పుట్టిన ప్రకటించి కొడుకు పేరు అకాయ్‌ అని ప్రకటించారు. కాగా ఇప్పటికే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు ఒక పాప ఉన్న విషయం తెలిసిందే. 2020లో వామిక జన్మించగా ఇప్పటికీ ఆమెను మీడియాకు పరిచయం చేయని విషయం తెలిసిందే. ఈ ఏడాది అకాయ్‌ జన్మించాడు. దీంతో విరాట్, అనుష్కల పిల్లలు పేర్లు వామికా, అకాయ్‌ పేర్లు అర్థం ఏంటంటే.  చేసేస్తున్నారు.






అకాయ్ అంటే..


ఫిబ్రవరీ 15న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు మగబిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని విరూష్కలు కాస్త లేట్‌గా ప్రకటించారు. అయితే బాబుకు అకాయ్ అనే పేరు పెట్టినట్టు రివీల్ చేశారు. అయితే అకాయ్‌ పేరుకు ఒక్కొక్క భాషలో ఒక్కొ అర్థం ఉంది. అకాయ్ అంటే ఏకత్వం. అకాయ్ అనేది ఐక్యా అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. దీనికి ఏకత్వం, ఎదురులేనిది, అతీత శక్తి కలిగింది అని అర్థాలు ఉన్నాయి. అలాగే దీనికి శరీరం అని అర్థం కూడా ఉంది. ఒరిజినల్‌గా అయితే అకాయ్ అనే పదం టర్కీ భాష నుంచి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే నిండు చంద్రుడు అని కూడా అర్థం వస్తుందట.


వామిక అంటే..


వామిక అనేది సంస్కృత పదం అని తెలుస్తోంది. అంటే దుర్గా దేవి అని అర్థం. దుర్గా దేవి అవతారాల్లో వామిక అవాకతరం ఒకటి అట. అంటే వామిక దుర్గా దేవి అవతారంలో ఒకటి. అలాగే  వామిక అంటే సురక్షణ, బలం, తల్లి ప్రేమ, క్రియేటివిటీ వంటి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ప్రత్యేకంగా వామ అనే పదానికి క్రియేటివిటీ అని అర్థం వస్తుంది. ఇక వామిక అంటే ఎక్కువగా ఆధ్యాత్మికం అనే అర్థం వస్తుంది. 



Also Read: రీరిలీజ్‌కు సిద్ధమైన రానా బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'లీడర్‌'? - ఆ రోజే థియేటర్లో సందడి!