తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించింది. ఆగష్టు 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇందులో తమన్నా, జాకీష్రాఫ్‌, మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, సునీల్‌, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటించింది. చాలా కాలం తర్వాత రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ నటించడం బాగా కలిసి వచ్చింది. వెండితెరపై రజనీకాంత్ - రమ్యకృష్ణ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో మరోసారి రమ్యకృష్ణ - రజనీకాంత్ కాంబినేషన్ ని తెరపై చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ లభించింది. వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.


‘బీస్ట్’ ఫెయిల్యూర్ ను గుర్తు చేసుకున్న ‘జైలర్’ దర్శకుడు


‘జైలర్’ సక్సెస్ తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఫుల్ జోష్ లో ఉన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అద్భుత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ఇదే సమయంలో తన గత సినిమా ‘బీస్ట్’ గురించి స్పందించారు. ఈ సినిమా ఫెల్యూర్ తనను చాలా బాధపెట్టినట్లు తెలిపారు. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఆకట్టుకోవడంలో విఫలం అయ్యిందన్నారు. ఈ సినిమా ఫెయిల్యూర్ తర్వాత హీరో విజయ్ తనతో చెప్పిన మాటలను దిలీప్ కుమార్ తాజాగా గుర్తు చేసుకున్నారు.  తమ సినిమా ఫెయిల్యూర్ అయినా, ఇప్పటికీ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. “విజయ్, నేను తరచుగా మాట్లాడుకుంటాం. సినిమా ఫెయిల్యూర్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. నువ్వు నాతో చెప్పినట్లు చేశావు. నేను నా వంతు ప్రయత్నం చేశాను. కొందరికి నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. ఇప్పుడు దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. ఇకపై బాగా తీసేందుకు ప్రయత్నిద్దాం అని విజయ్ చెప్పారు” అన్నారు. “సినిమా ఫెయిల్యూర్ పట్ల మీరు బాధపడలేదా? నాపై కోపం రాలేదా? అని నేను అడిగితే- ఎలాంటి కోపం లేదు అని చెప్పారు. అందుకే, తమ స్నేహం ఇప్పటికీ కొనసాగుతుంది” అన్నారు. ‘జైలర్’ హిట్ తర్వాత విజయ్ తనకు శుభాకాంక్షలు చెప్పినట్లు వెల్లడించారు.


ప్రేక్షకులను ఆకట్టుకోని  ‘బీస్ట్’


దళపతి విజయ్, పూజా హెగ్డే నటించిన చిత్రం ‘బీస్ట్’. గత ఏడాది ఏప్రిల్ లో విడుదలైంది.  డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై విజయ్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.  అయితే, సినిమా విడుదల తర్వాత మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో విజయ్ అభిమానులు నిరాశ చెందారు. అప్పట్లో ఆయన అభిమానులు ఓ థియేటర్‌లో స్క్రీన్‌ కు నిప్పు  పెట్టడం సంచలనం కలిగించింది. ‘బీస్ట్’ విడుదల తర్వాత ‘జైలర్’ మూవీ నుంచి నెల్సన్ దిలీప్‌కుమార్‌ను తొలగించినట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే, రజనీకాంత్ ఆయను అలాగే కొనసాగించారు. తాజాగా విడుదలైన ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. నాలుగు రోజుల్లోనే రూ. 222 కోట్ల రూపాయలను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.    


Read Also: మళ్లీ కలిసి పనిచేస్తున్న ‘విరూపాక్ష’ టీమ్ - ఈసారి పౌరాణిక థ్రిల్లర్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial