Naveen Polishetty :  కామెడీ ఎంటర్ టైనర్ 'జాతి రత్నాలు'తో సంచలనం సృష్టించిన హీరో నవీన్ పొలిశెట్టి నెక్స్ట్ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయింది. హీరోయిన్ అనుష్క శెట్టితో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' అనౌన్స్ మెంట్ తర్వాత.. మరో సినిమా 'అనగనగా ఒక రాజు' టైటిల్ తో మూవీని ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో 'డీజే టిల్లు' ఫేం నేహా శెట్టి, అంజలిలు హీరోయిన్లుగా ఫిక్స్ అయ్యారని సమాచారం.


అనుదీప్ దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ అందించిన 'జాతి రత్నాలు'తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు హీరో నవీన్ పొలిశెట్టి. తన కామెడీతో, పంచులతో కడుపుబ్బా నవ్విస్తూనే.. నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ను దక్కించుకున్న జాతి రత్నాలు తర్వాత నవీన్ పొలిశెట్టి సినిమాలు ఇప్పటివరకూ ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఓ రెండు సినిమాలకు సైన్ చేశాడు. అందులో ఒకటి 'బాహుబలి'తో 'దేవసేన'గా ప్రపంచం వ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న స్వీటీ బ్యూటీ 'అనుష్క'తో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' కాగా.. మరొకటి 'అనగనగా ఒక రాజు'. ఈ మూవీలో 'డీజే టిల్లు'లో రాధిక క్యారెక్టర్ లో జనాలను ఆకట్టుకున్న నేహా శెట్టితో పాటు, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో 'సీత'గా మెప్పించిన హీరోయిన్ అంజలి కూడా నవీన్ సరసన నటిస్తున్నారు. 


హీరోయిన్స్ అనుష్క శెట్టి, నేహా శెట్టిలతో హీరో నవీన్ పొలిశెట్టి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. వీరిద్దరూ కర్ణాటకకు చెందిన అమ్మాయిలే కావడం గమనార్హం. కో ఇన్సిడెంట్ గా జరిగినా... వీరిద్దరి సరసన నటించడం నవీన్ కు ప్లస్ గా మారనుందని ఆయన ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేహా శెట్టి విషయానికొస్తే... ఈమె 2014లో జరిగిన 'మిస్ మంగళూరు' అందాల పోటీతో గెలిచారు. 'మిస్ సౌత్ ఇండియా' 2015 రన్నరప్‌గా కూడా నిలిచారు. దర్శకుడు శశాంక్ తీసిన కన్నడ చిత్రం 'ముంగారు మలే 2'తో ఇండస్ట్రీకి పరిచయమైన నేహా... పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'మెహబూబా' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆమె కన్నడ సినిమాతో పాటు 'మెహబూబా', 'గల్లీ రౌడీ', 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్', 'డీజే టిల్లు' లాంటి చిత్రాల్లో నటించారు. వీటిలో అత్యంత ఎక్కువగా 'డీజే టిల్లు'లో నటనకు ఆమెకు ఎక్కువ మార్కులు పడిన విషయం తెలిసిందే.


ఇక అనుష్క శెట్టి గురించి చెప్పాలంటే ఈమె కూడా కర్ణాటకలోనే పుట్టారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన 'సూపర్' చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టి, ఆ తర్వాత 'విక్రమార్కుడు', 'లక్ష్యం', 'అరుంధతి', 'అస్త్రం', 'డాన్', 'బలాదూర్', 'చింతకాయల రవి', 'బాహుబలి' లాంటి చిత్రాలలో నటించారు. ఇక ఆమె కెరీర్లో అత్యంత మైలురాయిగా నిలిచిన చిత్రం అరుంధతి. ఇలా భిన్న క్యారెక్టర్లతో అభిమానుల్ని సొంతం చేసుకున్న స్వీటీ... ఇప్పుడు నవీన్ పొలిశెట్టి సరసన నటిస్తుండడంతో మూవీని చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.


Also Read : ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ


డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'అనగనగా ఒక రాజు'లో నవీన్ పాత్ర 'జాతి రత్నాలు' తరహాలో అంత ఫుల్ ఎనర్జీతో ఉంటుందని మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రీసెంట్ గా టైటిల్ ను అనౌన్స్ చేయడంతో నవీన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అనుష్క శెట్టితో చేస్తోన్న "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి"పై మేకర్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ మూవీపై మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ఈ చిత్రానికి పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. అంతేకాకుండా మార్చి 22న ఉగాది సందర్భంగా విడుదల చేసిన లిరికల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాల భాషల్లో ఈ విడుదల కాబోతుండగా... త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్టు సమాచారం.


Also Read : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్