హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాలు అనగానే మనకు ముందుగా 'బాహుబలి' గుర్తొస్తుంది. ఇప్పుడు 'పుష్ప 2'. ఇది ఇండియన్ బాక్స్ ఆఫీసు కథ. కానీ విదేశాల్లో భారీ కలెక్షన్స్ రాబట్టిన మన సినిమాలు అనగానే 'దంగల్', 'పుష్ప 2' వంటి ఇండియన్ సినిమాలు సృష్టించిన అరాచకం గుర్తొస్తుంది. అమీర్ ఖాన్ 'దంగల్' మూవీ చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. ఆ మూవీ రికార్డుని అల్లు అర్జున్ 'పుష్ప2' బ్రేక్ చేస్తుందని అందరూ ఊహించారు. అది జరగలేదనుకోండి. ఈ రోజు మాత్రం 2000 కోట్లు కాదు కేవలం 9 రోజుల్లోనే చైనా బాక్స్ ఆఫీసు దగ్గర 7000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా గురించి మాట్లాడుకుందాం. 

హీరో హీరోయిన్లు లేకుండానే 7000 కోట్లుచైనీస్ బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తున్న మూవీ హీరోహీరోయిన్లు లేకుండానే ఈ అరుదైన ఘనతను సాధించింది. జనవరి 29న రిలీజ్ అయిన యానిమేటెడ్ మూవీ 'నే ఝా 2' రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ మూవీకి ఇప్పటిదాకా 580 కోట్ల చైనీస్ యువాన్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇండియన్ కరెన్సీలో ఈ లెక్క రూ. 7000 కోట్ల రూపాయలన్నమాట. లూనార్ న్యూ ఇయర్ సెలవుల సందర్భంగా 'నే ఝా 2' రిలీజ్ అయ్యి, రోజుకో కొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది. ఇప్పటిదాకా చైనా సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ మూవీ మరో కొత్త చరిత్రను సృష్టించింది. వన్ బిలియన్ డాలర్లు వసూలు చేసిందీ సినిమా.

Also Readఇండియాలో కాస్ట్లీయస్ట్ విలన్... రెమ్యూనరేషన్‌లో 'కల్కి 2898 ఏడీ' కమల్, 'యానిమల్‌' బాబీని బీట్ చేసిన హీరోయిన్

పాపులర్ నవల ఆధారంగా 'నే ఝా 2' 'నే ఝా 2' సినిమాను అంతర్జాతీయ మార్కెట్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇదొక ఒక చైనీస్ యానిమేటెడ్ మూవీ. దీనికి జియావోజీ దర్శకత్వం వహించారు. 2019లో రిలీజ్ అయిన 'నే ఝా' అనే మూవీకి సీక్వెల్ గా వచ్చింది 'నే ఝా 2'. 2020లో రిలీజ్ అయిన జియాంగ్ జియా తర్వాత ఫెంగ్‌షెన్ ఫ్రాంచైజీలో మూడవ చిత్రం. ఈ మూవీని 16వ శతాబ్దపు క్లాసిక్ చైనీస్ నవల 'ఇన్వెస్టిచర్ ఆఫ్ ది గాడ్స్' ఆధారంగా రూపొందించారు.

Also Read: చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ... హీరోయిన్ సూసైడ్ అటెంప్ట్‌తో వార్తల్లోకి ప్రేమ కహానీ... హీరోగా హిట్స్ వచ్చినా ఇప్పుడు ఛాన్సుల్లేవ్