నయనతార పెళ్ళికి సమంతకు ఆహ్వానం అందింది. 'కన్మణి ఖతీజా రాంబో' (KRK Movie) షూటింగ్ సమయంలో ఈ అగ్ర కథానాయికలు ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.  ఆ తర్వాత బాగా బలపడింది. పైగా, ఆ సినిమాకు దర్శకత్వం వహించినది నయనతారతో ఏడడుగులు వేస్తున్న విఘ్నేష్ శివన్. అందువల్ల, ఆహ్వానం అందడంలో వింత ఏమీ లేదు. అయితే, నయనతార పెళ్ళికి సమంత వెళ్ళడం లేదట.

Continues below advertisement


Nayanthara Vignesh Shivan Wedding: అవును... విఘ్నేష్ శివన్ - నయనతార పెళ్ళికి సమంత వెళ్ళడం లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దీనికి కారణం విజయ్ దేవరకొండ 'ఖుషి' షూటింగ్ కారణం అంటున్నారు. ఆ సినిమాలో సమంత కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య కొన్ని రోజులు కశ్మీర్ లో షూటింగ్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని టాక్. అందువల్ల, పెళ్ళికి సమంత హాజరు కాలేకపోతున్నారట.


Also Read: పెళ్లి తర్వాత నటనకు నయనతార దూరం? కాబోయే అత్తగారు పెట్టిన కండిషన్ కారణంగా






షూటింగ్ షెడ్యూల్స్ వల్ల కరణ్ జోహార్ 50వ బర్త్ డే పార్టీకి కూడా సమంత అటెంట్ కాలేదని టాక్. నయనతారకు తన పరిస్థితి వివరించి... కంగ్రాచ్యులేషన్స్ చెప్పారట సమంత.


Also Read: టాలీవుడ్‌ను పక్కన పెట్టిన నయనతార - తెలుగు సినీ ప్రముఖులకు శుభలేఖలు ఎక్కడ? పిలుపులు ఏవి?