మామూలుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్‌లోని నటీమణులే ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకుంటారని అంటుంటారు. కానీ ఈమధ్య ఆ ట్రెండ్ సౌత్‌లో కూడా మొదలయ్యింది. హీరోలకు తీసిపోని రెమ్యునరేషన్ తీసుకోవాలని హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారేమో అనిపిస్తోంది. ప్రస్తుతం కేవలం సౌత్‌లోనే కాదు.. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటీమణిగా పేరు దక్కించుకుంది నయనతార. తాజాగా ‘జవాన్’లో షారుఖ్ ఖాన్ సరసన నటించి బాలీవుడ్‌లో గ్రాండ్ డెబ్యూ ఇచ్చిన నయన్ రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఒక చిన్న యాడ్ కోసం నయనతార ఎంత తీసుకుంటుంది అనే విషయం బయటికొచ్చి ప్రేక్షకులు షాకవుతున్నారు.


రూ.200 కోట్లకు పైగా ఆస్తి..
ఎన్నో ఏళ్లుగా దాదాపు అన్ని సౌత్ భాషల్లోని సినిమాల్లో నటిస్తూ.. మెల్లగా లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగింది నయనతార. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అయినా కూడా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఏ సీనియర్ స్టార్ హీరో సరసన హీరోయిన్ కావాలన్నా ముందుగా నయనతార పేరునే తలచుకుంటున్నారు మేకర్స్. దీంతో తనకు డిమాండ్‌కు తగినట్టుగా రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తోంది నయన్. ఇప్పటికే నయనతార ఆస్తుల విలువ దాదాపు రూ.200 కోట్లపైనే ఉండగా.. ఇంకా తన ఆస్తులను పెంచుకుంటూ పోయే ప్రయత్నం చేస్తోంది. సౌత్ ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో కేవలం నయనతారకు మాత్రమే ప్రైవేట్ జెట్ ఉంది. అంతే కాకుండా సినిమాల విషయంలో మాత్రమే కాకుండా యాడ్స్ విషయంలో కూడా నయనతార రెమ్యునరేషన్ పీక్స్‌లో ఉందని టాక్ వినిపిస్తోంది.


50 సెకండ్ల కోసం అంత రెమ్యునరేషన్..!
తాజాగా ఒక 50 సెకండ్ల యాడ్ కోసం నయనతార.. దాదాపు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. యాడ్ సమయం పెరిగినకొద్దీ రెమ్యునరేషన్ కూడా పెరుగుతుందట. అలా నయన్.. ఒక యాడ్ కోసం దాదాపు రూ.4 నుంచి 7 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం. హిందీలో ‘జవాన్’ అనేది నయనతారకు మొదటి సినిమానే అయినా సౌత్‌లో తనకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ మూవీకి భారీ రెమ్యునరేషనే డిమాండ్ చేసిందట. మేకర్స్ కూడా తను అడిగిన రెమ్యునరేషన్‌ను సంతోషంగా అందించినట్టు సమాచారం. అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నా కూడా ప్రస్తుతం నయన్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. 


అరడజను సినిమాలతో బిజీ..
ప్రస్తుతం ‘పాట్టు’, ‘లేడీ సూపర్‌స్టార్ 75’, ‘ది టెస్ట్’, ‘ఇరైవన్’, ‘డియర్ స్టూడెంట్స్’, ‘తనీ ఒరువన్ 2’ చిత్రాలతో బిజీగా ఉంది నయనతార. ఒకవైపు తన ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీగా ఉంటూనే.. పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తన కవల పిల్లలు ఉయిర్, ఉలగ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి మొహాలను ఫ్యాన్స్‌కు రివీల్ చేసింది. అంతే కాకుండా తన భర్త విఘ్నేష్ శివన్‌తో గడిపే క్యూట్ మూమెంట్స్‌ను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది నయన్. కొన్నాళ్ల క్రితం వరకు నయనతార.. సోషల్ మీడియాకు దూరంగా ఉండేది. కానీ తాజాగా ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకొని.. తన ఫ్యాన్స్‌కు రెగ్యులర్‌గా టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తోంది.


Also Read: ఇండస్ట్రీలో రామ్ చరణ్‌కు 16 ఏళ్లు పూర్తి - స్పెషల్‌గా విష్ చేసిన ఉపాసన


Join Us on Telegram: https://t.me/abpdesamofficial