Nayanthara Reacts On Divorce Rumours: తన భర్తతో డివోర్స్ తీసుకోబోతున్నారంటూ వస్తోన్న రూమర్లకు హీరోయిన్ నయనతార ఒక్క ఫోటోతో చెక్ పెట్టారు. ఇటీవల ఆమె ఇన్ స్టాలో చేసిన ఫోస్టుతో ఈ దంపతులు విడిపోనున్నారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ఆమె తాజాగా స్పందించారు.

ఒక్క ఫోటోతో...

తన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీపై వస్తోన్న రూమర్లకు ఒక్క ఫోటోతో నయన్ చెక్ పెట్టేశారు. తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ... 'మాపై వచ్చే సిల్లీ న్యూస్ చూసినప్పుడు మా రియాక్షన్ ఇదే.' అంటూ రాసుకొచ్చారు. దీంతో డివోర్స్ అంటూ జరిగిన ప్రచారం ఫేక్ అని తేలిపోయింది.

Also Read: కార్తీ జోడీగా కల్యాణీ ప్రియదర్శన్... పూజతో మొదలైన 'మార్షల్'... సినిమా షురూ

రూమర్స్... ఆ పోస్ట్ ఏంటంటే?

నయనతార కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. పెట్టిన కొద్దిసేపటికే దాన్ని ఆమె డిలీట్ చేశారు. వైవాహిక బంధం గురించి చెబుతూ... 'తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు. భర్త చేసే పనులకు భార్య ఎందుకు బాధ్యత వహించాలి. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను చాలా అనుభవించాను.' అంటూ పోస్ట్ చేశారు. కొన్ని గంటల గ్యాప్‌లోనే ఈ పోస్ట్ ఆమె డిలీట్ చేశారు. ఈలోపే దీనిపై నెట్టింట విస్తృతంగా ప్రచారం సాగింది.

ఆ స్క్రీన్ షాట్స్ వైరల్ కాగా... నయనతార విఘ్నేష్ శివన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ రూమర్స్ వచ్చాయి. అటు కోలీవుడ్ మీడియా ఇటు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. 

పళని టెంపుల్‌లో ఫ్యామిలీతో కలిసి...

ఈ రూమర్స్ వచ్చిన రెండు రోజులకే నయనతార విఘ్నేష్ కపుల్ (Nayanthara Vignesh) తమ పిల్లలతో కలిసి తమిళనాడు పళని టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఇద్దరూ సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా అప్పుడే డివోర్స్ రూమర్లకు చెక్ పడింది. తాజాగా... నయనతారనే స్వయంగా ఒక్క ఫోటోతో ఈ రూమర్లన్నంటికీ చెక్ పెట్టేశారు. 

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు నయనతార. తమిళ మూవీ 'చంద్రముఖి'తో ఆమె తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. 'లక్ష్మి' మూవీతో పాపులారిటీ సొంతం కాగా... స్టార్ హీరోల సరసన నటించారు. రీసెంట్‌గా ఆమె నటించిన 'టెస్ట్' మూవీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా డైరెక్టర్, నటుడు, నిర్మాత, లిరిసిస్ట్‌గా స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు. 

ప్రస్తుతం చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మెగా 157' (వర్కింగ్ టైటిల్) మూవీలో నయన్ హీరోయిన్‌గా చేస్తున్నారు. అలాగే, కన్నడ స్టార్ యష్ సరసన 'టాక్సిక్' మూవీలోనూ నటిస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీలో నటిస్తుండగా... ఈ సినిమాను విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్నారు.