'కుబేర'తో జాతీయ పురస్కార గ్రహీత ధనుష్ (Dhanush) వంద కోట్ల విజయం అందుకున్నారు. 'సార్' తర్వాత మరోసారి స్ట్రయిట్ తెలుగు సినిమాతో హిట్ కొట్టారు. 'కుబేర' సక్సెస్ జోరులో కొత్త సినిమా స్టార్ట్ చేశారు ధనుష్. ఇది ఆయన 54వ సినిమా. ఆ వివరాల్లోకి వెళితే... 

ధనుష్ సరసన 'ప్రేమలు' మమితా బైజు!Dhanush Mamitha Baiju movie: విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న తమిళ థ్రిల్లర్ 'పోర్ తొళిల్'. ఆ చిత్ర దర్శకుడు విఘ్నేష్ రాజాతో ధనుష్ తన 54వ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని థింక్ స్టూడియోస్ సహకారంతో వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ ఇషారి కె. గణేష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్. 

ధనుష్ 54వ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. కాన్సెప్ట్ పొస్టర్ కూడా విడుదల చేశారు. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజే స్టార్ట్ చేశారు. ఇదొక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాకు దర్శకుడు విఘ్నేష్ రాజాతో ఆల్ఫ్రెడ్ ప్రకాష్ స్క్రిప్ట్ రాశారు. వివిధ లొకేషన్లలో సినిమా చిత్రీకరణ చేస్తామని, ప్రేక్షకులకు క్వాలిటీ కంటెంట్‌ అందిస్తామని నిర్మాత తెలిపారు.

Also Readబాహుబలి @ 10 - తెర వెనుక సమ్‌గతుల నుంచి రికార్డ్స్‌, అవార్డ్స్‌ వరకూ... ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ తెలుసా?

Dhanush 54th movie cast and crew announced: ధనుష్ సరసన మమితా బైజు నటిస్తున్న కెఎస్ రవికుమార్, జయరామ్, కరుణాస్, సూరజ్ వెంజరమూడు, పృథ్వీ పాండియరాజన్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి దర్శకత్వం: విఘ్నేష్ రాజా, నిర్మాత: డాక్టర్ ఈశారి కె గణేష్, నిర్మాణ సంస్థ: వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ - థింక్ స్టూడియోస్, రచయితలు: ఆల్ఫ్రెడ్ ప్రకాష్ & విఘ్నేష్ రాజా, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం: తేని ఈశ్వర్, కూర్పు: శ్రీజిత్ సారంగ్, కళా దర్శకత్వం: మాయాపాండి.

Also Readరాజమౌళిని హీరో చేయాలనుకున్న పెదనాన్న... బాలకృష్ణుడిగా జక్కన్న... శివ‌శ‌క్తి ద‌త్తా దర్శకత్వంలో ఆగిపోయిన మైథ‌లాజిక‌ల్ మూవీ ఏదో తెలుసా?