'సత్యం సుందరం' సినిమాతో హీరో కార్తీ (Actor Karthi) మంచి విజయం సొంతం చేసుకున్నారు. విమర్శకులతో పాటు ప్రేక్షకులను ఆ సినిమా మెప్పించింది. దాని తర్వాత 'సర్దార్ 2' చేశారు. ఇప్పుడు కొత్త సినిమాను పూజతో ప్రారంభించారు. 

'మార్షల్'గా వస్తున్న కార్తీకార్తీ కథానాయకుడిగా నటిస్తున్న 29వ సినిమాకు 'మార్షల్' టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్. 'తానక్కారన్' ఫేమ్ తమిళ్ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఇషాన్ సక్సేనా సహ నిర్మాత.

Also Readబాహుబలి @ 10 - తెర వెనుక సమ్‌గతుల నుంచి రికార్డ్స్‌, అవార్డ్స్‌ వరకూ... ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ తెలుసా?

జూలై 10న పూజా కార్యక్రమాలతో 'మార్షల్' ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాలో సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కెన్, ఈశ్వరి రావు, మురళీ శర్మ ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: సత్యన్ సూర్యన్, సంగీతం: సాయి అభ్యాంకర్, ఎడిటర్‌: ఫిలోమిన్ రాజ్, ప్రొడక్షన్ డిజైనర్‌: అరుణ్ వెంజరమూడు, సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా, నిర్మాతలు: ఎస్ఆర్ ప్రకాష్ బాబు - ఎస్ఆర్ ప్రభు, నిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రచన - దర్శకత్వం: తమిళ.

Also Readరాజమౌళిని హీరో చేయాలనుకున్న పెదనాన్న... బాలకృష్ణుడిగా జక్కన్న... శివ‌శ‌క్తి ద‌త్తా దర్శకత్వంలో ఆగిపోయిన మైథ‌లాజిక‌ల్ మూవీ ఏదో తెలుసా?