‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ‘జాతిరత్నాలు’ విజయం తర్వాత యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి నటించిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అందుకుంది. మహేష్ బాబు. పి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదలై మూడు వారాలు గడుస్తున్నా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ గురించి మాట్లాడిన నవీన్, పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


‘జవాన్’తో పోటీనా అంటూ భయపెట్టారు!


‘జవాన్’ సినిమాకు పోటీగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’  రిలీజ్ అవుతుందని తెలిసి చాలా భయమేసిందన్నారు నవీన్.  “సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన దగ్గరిని చాలా టెన్షన్ పడ్డాను. సినిమా ప్రమోషన్స్ లో హ్యాపీగా, జాలీగా పాల్గొన్నట్లు కనిపించినా, లోపల భయం మాత్రం అలాగే ఉంది. రిలీజ్ కు ముందు కొన్నిసార్లు నిద్ర కూడా పట్టలేదు. మూడేళ్లు ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. నిజానికి ఏ సినిమాతో పోటీ లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాలని భావించాం. ఎప్పుడైతే ‘జవాన్’ సినిమాతో పాటు మా సినిమా విడుదల కాబోతోందని తెలిసిందో, అప్పటి నుంచి వణుకు మొదలైంది. రిలీజ్ తర్వాత మా సినిమాకు మంచి టాక్ రావడం, వసూళ్లు అద్భుతంగా రావడంతో సంతోషం అనిపించింది. ‘జవాన్’తో పోటీ పడి తప్పు చేస్తున్నారని చెప్పిన చాలా మంది ఇప్పుడు మా నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.  ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’  సూపర్ డూపర్ హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది” అన్నారు నవీన్.   


Also Read : కుర్రాడిగా మారేందుకు జగ్గూ భాయ్ పాట్లు.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా?


ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి  భారీ స్పందన


ఈ సినిమా విషయంలో ప్రేక్షకుల నుంచి మంచి మద్దతు లభించిందని నవీన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, బ్రిటన్ లో సినిమా మూడో వారంలోకి వచ్చాక  స్ర్కీన్స్ సంఖ్య మరింతగా పెరిగినట్లు చెప్పారు. ఓవర్సీస్ లో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాకు మంచి స్పందన లభిస్తోందన్నారు.  గతంతో పోల్చితే ఇప్పుడు షోలు పెంచుతున్నట్లు తెలిపారు. అమెరికాలో మూడో వారంలో ఏకంగా 200 చోట్ల స్ర్కీన్స్ సంఖ్య పెంచినట్లు నవీన్ వెల్లడించారు. ఈ సినిమాతో తన ఖాతాలో ముచ్చటగా మూడో హిట్ పడిందన్నారు. వరుస హిట్లతో చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సినిమా సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మూడు కథలు ఓకే చేసినట్లు చెప్పిన నవీన్, వచ్చే ఏడాది నుంచి ఒక్కో సినిమా పనులు మొదలవుతాయన్నారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంలో జయసుధ, నాజర్, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తి, అభినవ్ గోమటం తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాకి రధన్ సంగీతం అందించారు.  


Read Also: ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial