టాలీవుడ్ ట్యాలెంటెడ్ ఆర్టిస్టుల్లో నవీన్ చంద్ర (Naveen Chandra) ఒకరు. ఛాన్స్ రావాలే గానీ... సినిమా సినిమాకు వేరియేషన్ చూపించే వెర్సటాలిటీ ఆయనకు ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 'మాస్ జాతర'తో ఆడియన్స్ అందరూ మరోసారి నవీన్ చంద్ర గురించి గట్టిగా మాట్లాడుకోవడం గ్యారెంటీ. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆయన విలనిజం ఇంపాక్ట్ అలాగుంది మరి.

Continues below advertisement

రవితేజకు ధీటైన విలన్‌గా నవీన్ చంద్ర!Naveen Chandra Plays A Powerful Antagonist In Ravi Teja Mass Jathara: 'మాస్ జాతర' ట్రైలర్‌లో వింటేజ్ రవితేజ కనిపించారని మాస్ మహారాజా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. 'వెంకీ'లో నవల నుంచి 'విక్రమార్కుడు'లో 'మేడమ్, పిల్లలు రాలేదా?' డైలాగ్ వరకు రవితేజ సూపర్ హిట్ సీన్లను దర్శకుడు భాను భోగవరపు రీ క్రియేట్ చేసినట్టు అర్థం అవుతోంది. ఆయన కామెడీ టైమింగ్, యాక్షన్ మోడ్ అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 'మాస్ జాతర' ట్రైలర్‌లో అభిమానులకు రవితేజ కనిపిస్తే... ఆయనతో పాటు సామాన్య ప్రేక్షకులను ఆకట్టుకున్నది మాత్రం నవీన్ చంద్ర అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

'కేజీ, రెండు కేజీలు కాదురా... ఇరవై టన్నులు! ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైనులో ఎక్కించండి' - 'మాస్ జాతర' ట్రైలర్ ప్రారంభమే నవీన్ చంద్ర వాయిస్‌తో మొదలు అయ్యింది. ప్రేక్షకులు ఆయన గొంతు గుర్తు పట్టారు. అయితే ఆయన లుక్ మాత్రం దర్శకుడు త్వరగా చూపించలేదు. వంద సెకన్స్ తర్వాత నవీన్ చంద్రను రివీల్ చేశారు. లుక్కుతో సగం మార్కులు కొట్టేశారు ఆయన. నుదుట నామాలు, చేతిలో త్రాచు... కొత్తగా కనిపించారు. లుక్కును మించి నటుడిగా ఇంప్రెస్ చేశారు నవీన్ చంద్ర. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రవితేజ అంటే హుషారుకు మారుపేరు. స్క్రీన్ మీద ఆయన ఉండగా మరొకరి మీద ప్రేక్షకుల చూపు వెళ్ళదని చాలా మంది చెప్పే మాట. అయితే రవితేజకు ధీటుగా నవీన్ చంద్ర సూపర్ విలనిజం చూపించారు.

Continues below advertisement

Also Readఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల

'లక్ష్మణ్ అంటే రాముడి బ్రదర్. అర్ధాయుష్షుతో పోతే ఆంజనేయుడు బతికించిన క్యారెక్టర్. ఇక్కడ సంజీవనీ లేదు... ఆంజనేయుడు రాడు' అంటూ నవీన్ చంద్ర చెప్పిన డైలాగ్ సూపర్బ్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల 'అరవింద సమేత వీరరాఘవ'లో జగపతిబాబు తనయుడిగా విలనిజం చూపించారు నవీన్ చంద్ర. ఆ పాత్రను మించి 'మాస్ జాతర'లో ఆయన రోల్ ఉండబోతుందని ట్రైలర్ బట్టి అర్థం అవుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా హీరో, విలన్ రోల్స్ చేస్తూ ముందుకు వెళుతున్నారు నవీన్ చంద్ర. 'మాస్ జాతర'తో ఆయనకు మాంచి బ్రేక్ వచ్చి మరింత బిజీ అయ్యే ఛాన్సులు పుష్కలంగా కనబడుతున్నాయి.

Also Read'కాంతార'లో ఆ రోల్ మేకప్‌కు 6 గంటలు... మాయావి కాదు... రిషబ్ శెట్టే - మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ!