Saripodhaa Sanivaaram Glimpse Out Now: నేచురల్ స్టార్ నాని స్క్రిప్ట్ సెలక్షన్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తన ఒక సినిమాకు, మరొక సినిమాకు.. అందులో తను చేసే పాత్రలకు అస్సలు సంబంధమే ఉండదు. ఇటీవల ‘హాయ్ నాన్న’లాంటి ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకులను మెప్పించి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు నాని. ఇంతలోనే ‘సరిపోదా శనివారం’ అంటూ మరో కొత్త కథతో అందరినీ అలరించడానికి వచ్చేస్తున్నాడు. ఇక నేచురల్ స్టార్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ విడుదల అయ్యింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ, మలయాళంతో పాటు హిందీలో కూడా ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. 


కాంబోలో రెండో సినిమా..


వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమే ‘సరిపోదా శనివారం’. దీనికంటే ముందు ‘అంటే సుందరానికీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ కాంబో. ఫీల్ గుడ్ చిత్రంగా తెరకెక్కిన ‘అంటే సుందరానికీ’ చిత్రం నానికి ఫ్లాప్‌ను తెచ్చిపెట్టినా.. ఈ హీరో మాత్రం వివేక్ ఆత్రేయకు మరో అవకాశం ఇచ్చాడు. అయితే తాజాగా విడుదలయిన గ్లింప్స్ చూస్తుంటే.. ‘అంటే సుందరానికీ’ సినిమాకు, ‘సరిపోదా శనివారం’కు అసలు సంబంధమే లేదని అర్థమవుతుంది. ‘అంటే సుందరానికీ’లో ఒక అమాయక బ్రాహ్మణ కుర్రాడిగా కనిపించిన నాని.. ఇందులో మాత్రం కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని సూర్య అనే పాత్రలో కనిపించాడు. అసలు ‘సరిపోదా శనివారం’కు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో కూడా గ్లింప్స్‌లో రివీల్ చేశారు.


అందుకే ఆ టైటిల్..


‘సరిపోదా శనివారం’లో నానికి విపరీతమైన కోపం ఉంటుంది. ఆ కోపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చూపించకూడదు, శనివారం మాత్రమే చూపించాలని నిర్ణయించుకుంటాడు. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది సినిమా కథ అని గ్లింప్స్ ద్వారా స్పష్టం చేశాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఇందులో నాని.. సూర్య అనే పాత్రలో కనిపించనున్నాడు. ‘కోపాలు రకరకాలు. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కొక్కలాగా ఉంటుంది’ అంటూ ఎస్‌జే సూర్య వాయిస్ ఓవర్‌తో ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్ మొదలవుతుంది. టీజర్‌లో ఎక్కువగా నానిపైనే ఫోకస్ పెట్టారు. కానీ చివర్లో ఎస్‌జే సూర్య కూడా కనిపించి భయంకరమైన నవ్వుతో దీనిని ఎండ్ చేశారు.






సోషల్ మీడియాలో ట్రెండింగ్..


నాని ఎక్కువగా పక్కింటబ్బాయి పాత్రల్లో, ప్రేక్షకులకు చాలా దగ్గరగా అనిపించే క్యారెక్టర్స్‌లో మాత్రమే కనిపించాడు. కానీ పలుమార్లు తన కంఫర్ట్ జోన్‌ను దాటి తన యాక్టింగ్‌ను ఛాలెంజ్ చేసే క్యారెక్టర్లు కూడా చేశాడు. అందులో ‘దసరా’ కూడా ఒకటి. ఆ సినిమాలో నాని డీ గ్లామర్ రోల్‌లో కనిపించడంతో పాటు తన పాత్రకు చాలా కోపం ఉన్నట్టుగా చూపించాడు దర్శకుడు. మరోసారి అంతే అగ్రెసివ్ పాత్రతో నాని.. ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నేచురల్ స్టార్ బర్త్‌డే సందర్భంగా విడుదలయిన ఈ గ్లింప్స్.. ఫ్యాన్స్‌ను హ్యాపీ చేస్తోంది. విడుదలయిన కాసేపట్లోనే దీనిని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేశారు నాని ఫ్యాన్స్.


Also Read: ఎన్‌‌టీఆర్, అల్లు అర్జున్‌తో తలపడాలని ఉంది - బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ వింత కోరిక