Narne Nithiin Second Movie Title Reveal: ఇటీవల ఎన్‌టీఆర్ కుటుంబం నుండి మరో కొత్త హీరో.. సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తనే నార్నే నితిన్. ప్రస్తుతం నెపోటిజంతో వచ్చిన హీరో అయినా.. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో అయినా అందరినీ ఒకేలాగా చూస్తున్నారు ప్రేక్షకులు. వారు చేసే సినిమాలో కంటెంట్ ఉంటే చాలు అనుకుంటున్నారు. అలా ‘మ్యాడ్’ అనే మూవీతో నార్నే నితిన్.. హీరోగా పరిచయమయ్యాడు. ఇక ఈ మూవీ విడుదలయిన ఆరు నెలల తర్వాత తన రెండో మూవీని ప్రారంభించాడు నితిన్. జీఏ 2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఒక క్రియేటివ్ వీడియోను విడుదల చేసి టైటిల్ గురించి బయటపెట్టారు.


ఫన్నీగా ఫోన్ సంభాషణ..


నార్నే నితిన్ అప్‌కమింగ్ మూవీ టైటిల్ రివీల్ చేయడం కోసం మూవీ టీమ్ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న బన్నీ వాస్.. దర్శకుడు అయిన అంజి కంచిపల్లికి ఫోన్ చేసి మూవీ టైటిల్ ఏంటని అడిగితే ఆయన ‘ఆయ్’ అంటారు. టైటిల్ అడిగితే ఆయ్ అంటారేంటి అని హీరో నార్నే నితిన్‌ను, హీరోయిన్ నయన్ సారికను కూడా లైన్‌లోకి తీసుకుంటారు. ఫైనల్‌గా సినిమా టైటిల్ ‘ఆయ్’ అని ప్రకటిస్తాడు దర్శకుడు. ఇక నిర్మాత బన్నీ వాస్ సైతం సమ్మర్‌లో కుమ్మేద్దాం అంటూ ఈ మూవీ సమ్మర్‌లో విడుదల అవుతుందని హింట్ ఇచ్చేశారు. బన్నీ వాస్‌తో పాటు ఈ చిత్రాన్ని విద్య కొప్పినీడి కూడా నిర్మిస్తున్నారు.






ఫస్ట్ లుక్ ఎప్పుడంటే.?


ఇప్పటికే ‘ఆయ్’ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి కూడా అడుగుపెట్టింది. అందుకే ప్రమోషన్‌లో వేగం పెంచాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ముందుగా ‘ఆయ్’ అని టైటిల్‌ను రివీల్ చేశారు. నిర్మాత సరదా సంభాషణ, ఫన్నీ మీమ్స్ రెఫరెన్స్‌లతో టైటిల్ అనౌన్స్‌మెంట్స్ కాన్సెప్ట్ వీడియో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇక సమ్మర్‌లో ఈ మూవీని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి మార్చి 7న ‘ఆయ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని కూడా టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారానే బయటపెట్టారు. 


బ్యాండ్ సింగర్ టు మ్యూజిక్ డైరెక్టర్..


ఒక ప్రైవేట్ బ్యాండ్ సింగర్‌గా అందరికీ దగ్గరయిన రామ్ మిర్యాల.. మెల్లగా సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్‌గా పాటలు పాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏకంగా ‘ఆయ్’ చిత్రంతో సంగీత దర్శకుడిగా మారుతున్నాడు. గీతా ఆర్ట్స్‌కు సంబంధించి మరొక బ్యానర్‌గా ప్రారంభమయిన జీఏ2 పిక్చర్స్.. ఇప్పటికే 8 సినిమాలను నిర్మించింది. అందులో చాలావరకు చిత్రాలు సూపర్ సక్సెస్‌ను అందుకున్నాయి. ఇప్పుడు ఈ బ్యానర్‌లో తెరకెక్కుతున్న 9వ చిత్రమే ‘ఆయ్’.


Also Read: ఏడాది పూర్తి చేసుకున్న 'బలగం' - ఎమోషనల్ పోస్ట్ చేసిన వేణు!