Director Venu Emotional Tweet : జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమౌతూ తెరకెక్కించిన 'బలగం' సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలంగాణ గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలను ఎంతో ఎమోషనల్ గా కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాలో చూపించిన విధానానికి యావత్ తెలుగు ప్రేక్షకులు దాసోహం అయిపోయారు. మొదట్లో చిన్న సినిమాగా విడుదలైన 'బలగం'.. ఆ తర్వాత అంచనాలకు మించి విజయాన్ని అందరి ప్రశంసలను అందుకుంది.
ఒక కమెడియన్ ఇలాంటి ఓ ఎమోషనల్ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమాతో దర్శకుడిగా వేణుకి ఎంతో మంచి గుర్తింపు లభించింది. కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్న 'బలగం' సినిమాకి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కాయి. అలాంటి ఈ సినిమా నేటితో(మార్చి 3) ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు వేణు తన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
వేణు ఎమోషనల్ ట్వీట్
'బలగం' సినిమా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు వేణు తన ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు." బలగం సినిమా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి మద్దతుగా నిలిచి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని రాసుకొచ్చాడు. దీంతో వేణు చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. కాగా ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. వీరితోపాటు కుటుంబ పెద్దగా కొమురయ్య పాత్రలో నటించిన సుధాకర్ రెడ్డి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మురళీధర్, గౌడ్ రూప లక్ష్మి, కోట జయరాం, కొమ్ము సుజాత, మైమ్ మధు, రచ్చ రవి, వేణు, జబర్దస్త్ రోహిణి కీలక పాత్రలు పోషించారు.
మేజర్ హైలెట్ గా భీమ్స్ సంగీతం
'బలగం' సినిమాకి అతిపెద్ద ప్లస్ సంగీతం. ఈ సినిమా కోసం బీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన సాంగ్స్ రిలీజ్ కి ముందే చాలా పాపులర్ అయ్యాయి. ఆ సాంగ్స్ తోనే సినిమాకి ఆడియన్స్ లో హైప్ పెరిగింది. సినిమాలో ఉన్న ఎమోషనల్ సాంగ్స్ ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టించాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్ మరో మెట్టు పైకి ఎక్కాడు. 'బలగం' సక్సెస్ తర్వాత మళ్ళీ తెలంగాణ నేటివిటీతో తెరకెక్కే సినిమాలకు దర్శకనిర్మాతలు మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్ ని ఎంపిక చేస్తున్నారు.
ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు
'బలగం' సినిమా ఆడియన్స్, సెలబ్రిటీస్ నుంచి ప్రశంసలు అందుకోవడమే కాదు అవార్డ్స్ లోనూ సత్తా చాటింది. ముఖ్యంగా ఈ సినిమాకి అంతర్జాతీయంగా ఎంతో మంచి గుర్తింపు లభించింది. కొన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో 'బలగం' సినిమాని ప్రదర్శించారు. ఈ సినిమాకి సుమారు వందకు పైగా అవార్డ్స్ వచ్చినట్లు చిత్ర యూనిట్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఆమధ్య 'బలగం' ఆస్కార్ కి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read : ‘తులసివనం’ వెబ్ సిరీస్ టీజర్ విడుదల - ఇది తులసిగాడి బయోపిక్!