Narendra Modi about Grammys Winners: ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇండియా రోజురోజుకీ స్పీడ్‌గా ముందుకెళ్తోంది. ఒకప్పుడు అంతర్జాతీయ అవార్డులను అందుకోవడం ఇండియన్ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి పెద్ద ఛాలెంజ్‌గా ఉండేది. కానీ ఆస్కార్ లాంటి అవార్డును సైతం దక్కించుకున్న తర్వాత మిగతావన్నీ కూడా దక్కించుకునే టాలెంట్ ఇండియాలో ఉందని ప్రేక్షకులు సంతోషిస్తున్నారు. ఇక ఆస్కార్ తర్వాత మరో అత్యున్నత పురస్కారం ఇండియా సొంతమయ్యింది. అది కూడా ఒకేసారి మూడు అంతర్జాతీయ అవార్డులు రావడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవార్డులు దక్కించుకున్న వారిని ప్రశంసిస్తూ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.
గ్రాండ్‌గా గ్రామీ పురస్కారాలు..
శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్‌తో పాటు ఇతర మ్యూజిషియన్స్‌కు మూడు గ్రామీ అవార్డులు దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యున్నత పురస్కారాలలో గ్రామీ అవార్డు కూడా ఒకటి. ఆదివారం గ్రామీ అవార్డుల వేడుక చాలా ఘనంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది గొప్ప మ్యూజిషియన్స్.. ఈ వేడుకకు హాజరయ్యారు. ఇండియాకు మూడు గ్రామీ అవార్డులు దక్కడంతో మరోసారి ఈ దేశంలో ఎంత టాలెంట్ ఉందో అందరూ గుర్తుచేసుకున్నారు. వీరందరికీ ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపారు. వారిని ఉద్దేశిస్తూ మోదీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధానితో పాటు మరెందరో భారత ప్రజలు వారికి కంగ్రాట్స్ తెలిపారు.
అందరికీ కంగ్రాట్స్..
‘గ్రామీ అవార్డుల వేడుకలో సక్సెస్ సాధించినందుకు జాకీర్ హుస్సేన్, రాకేశ్, శంకర్ మహదేవన్, సెల్వ, గణేష్‌కు కంగ్రాట్స్. మీ అసాధారణమైన ప్రతిభ, సంగీతం పట్ల మీ ప్రేమ ప్రపంచవ్యాప్తంగా మనసులను దోచుకుంది. ఇండియా గర్విస్తోంది. ఈ విజయాలన్నీ మీ కష్టానికి నిదర్శనగా నిలుస్తాయి. తరువాతి తరం ఆర్టిస్టులను కూడా పెద్ద కలలు కంటూ సంగీతంలో మెరుగుపడడానికి స్ఫూర్తినిస్తాయి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్ చేశారు. వీరిని మాత్రమే కాదు.. ఇండియాను గర్వపడేలా చేసే ప్రతీ ఆర్టిస్టును నరేంద్ర మోదీ ఎప్పుడూ అభినందిస్తూనే ఉంటారని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.
‘పాష్తో’ పాటకు అవార్డ్..
ఇక గ్రామీ అవార్డుల విషయానికొస్తే.. మ్యూజిషియన్ జాకీర్ హుస్సేన్‌కు, ఫ్లూటిస్ట్ రాకేశ్ చౌరాసియాకు కలిపి ఒక గ్రామీ అవార్డ్ దక్కింది. ‘ఆస్ వీ స్పీక్’ అనే ఆల్బమ్‌లోని ‘పాష్తో’ అనే పాటకు ఈ అవార్డును అందుకున్నారు జాకీర్ హుస్సేన్, రాకేశ్ చౌరాసియా. ఈ పాటలో అమెరికన్ యాక్టర్లు బెలా ఫ్లెక్, ఎడ్జర్ మేయర్ నటించారు. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరిలో అవార్డును అందుకుంది ఈ పాట. ఫాలూ క్రియేట్ చేసిన ‘అబాండెన్స్’ అనే పాట కూడా బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరిలో ఎంపికయ్యింది. ప్రధాని మోదీపై ఈ పాటను చిత్రీకరించారు ఫాలూ. కానీ జాకీర్, రాకేశ్ కలిసి క్రియేట్ చేసిన ‘పాష్తో’నే గ్రామీ జ్యూరీని ఎక్కువగా ఆకట్టుకుంది.
Also Read: హైదరాబాద్ చేరుకున్న మహేష్ - సూపర్ స్టార్ కొత్త లుక్ చూశారా? వీడియో వైరల్