Mahesh Babu Back to Hyderabad: 'గుంటూరు కారం'తో హిట్‌ కొట్టిన సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు.. ఆ తర్వాత వెకేషన్‌ కోసం జర్మనీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఫస్ట్‌ మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్‌ మాత్రం సర్‌ప్రైజ్‌ చేశాయి. మిక్స్‌ టాక్‌ నుంచి మెల్లిమెల్లిగా హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక మూవీ సక్సెస్‌ అవ్వడంతో మహేష్‌ అదే జోష్‌లో జర్మనీ వెకేషన్‌కి వెళ్లాడు. ఎందుకు అనేది తెలియదు కానీ, అంతా రాజమౌళి సినిమా కోసమే అనేది ఇన్‌సైడ్‌ టాక్‌. SSMB29 కోసం మేకోవర్‌ అయ్యేందుకు జర్మనీ వెళ్లినట్టు సమాచారం. అయితే దీనిపై క్లారిటీ లేదు.


దీంతో ఫ్యాన్స్‌ అంతా మహేష్‌ వెకేషన్‌పై ఆసక్తిగా ఉన్నారు. దాదాపు మూడు వారాల పాటు జర్మనీలోనే ఉన్న మహేష్‌ ఆదివారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా మహేష్‌ కొత్త లుక్‌ చూసి అంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. ప్రస్తుతం మహేష్‌ న్యూలుక్‌ నెట్టింట ట్రెండ్‌ అవుతుంది. సూపర్‌ స్టార్‌ ఫిట్‌నెస్‌ అదుర్స్‌ అని, ఆయన టుక్‌ నెక్ట్‌లెవల్‌ అంటున్నారు. హెయిర్‌ స్టైల్‌ చాలా బాగుతుందని, మొత్తానికి మహేష్‌ కొత్త లుక్‌ వెరే లెవల్‌ అంటున్నారు. ప్రస్తుతం మహేష్‌ వీడియో, ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. 






పాన్‌ వరల్డ్‌గా రాబోతున్న ఈ మూవీలో మహేష్‌ జేమ్స్‌ తరహాలో కనిపించనున్నాడని, అందుకోసమే ఈ సినిమా కోసం మహేష్‌ ఫిట్‌నెస్‌పై ద్రష్టి పెట్టాడు. ఈ సినిమా కోసం స్పెషల్‌గా జర్మనీలో ఫిట్‌నెస్‌ ట్రెయినింగ్‌ తీసుకున్నాడట. తాజాగా మహేష్‌ మేకోవర్‌ చూసి ఫ్యాన్స్‌ స్టన్‌ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జస్ట్‌ ప్రకటనతోనే ఈ మూవీపై భారీ బజ్‌ క్రియేట్‌ అయ్యింది.


Also Read: ఆమె నిజంగానే పోతే బాగుండు - పూనమ్‌ పాండే పబ్లిసిటీ స్టంట్‌పై నటి కస్తూరి ఫైర్‌


ఫారెస్ట్‌ అడ్వెంచర్‌గా రానుందని, ఇందులో మహేష్‌ జేమ్స్‌ బాండ్‌ తరహాలో కనిపించానున్నాడని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు రాజమౌళి స్క్రిప్ట్‌ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ మూవీ స్క్రిప్ట్‌ పూర్తయ్యిందని రాజమౌళి తండ్రి, రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు. ఇక త్వరలోనే మూవీ షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుందని అప్‌డేట్‌ ఇచ్చి మూవీపై హైప్‌ క్రియేట్‌ చేశారు. అంటే మరో రెండు నెలల్లో ఈ సినిమా సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. దాదాపు ఈ మూవీ రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం.