నారా రోహిత్ - సిరి లేళ్ల జంట రాబోయే అక్టోబర్‌లో ఏడు అడుగులు వేయనున్నారు. గతేడాది వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. అయితే రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మరణం కారణంగా వివాహాన్ని వాయిదా వేశారు. తండ్రి మరణించిన దుఃఖంలో ఉన్న రోహిత్ నారాకు సిరి అండగా నిలబడ్డారు. అడుగడుగునా మద్దతు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ జంట ఎక్కడ ఉందో తెలుసా? 

ఆస్ట్రేలియా వెళ్లిన కాబోయే కొత్త జంట!ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ప్రాంతంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం కార్యక్రమం జరిగింది. అందులో నారా రోహిత్ - సిరి లేళ్ల పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఘనతల గురించి, ఆయనతో ఉన్న అనుబంధం గురించి, ఆయన ఇచ్చిన స్ఫూర్తి గురించి రోహిత్ మాట్లాడారు.

'వీర భోగ వసంత రాయులు' సినిమా తర్వాత నటనకు నారా రోహిత్ కాస్త విరామం ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆరేళ్ల తర్వాత గత ఏడాది రిలీజ్ అయిన 'ప్రతినిధి 2'తో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమా సక్సెస్ కాలేదు. కానీ, నారా రోహిత్ నటనను మరోసారి ప్రేక్షకులకు గుర్తు చేసింది. ఈ ఏడాది విడుదలైన 'భైరవం'తో నటుడిగా పేరుతో పాటు చక్కటి విజయాన్ని అందుకున్నారు నారా రోహిత్.

Also Readసెలూన్ ఓపెనింగ్‌కు పవన్ కళ్యాణ్... అదీ జాగింగ్ డ్రస్‌లో... ఎందుకు వెళ్లారో తెలుసా?

ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవంలో పాల్గొనడంతో పాటు నారా రోహిత్ - సిరి లేళ్ల జంట ఆస్ట్రేలియా టూర్ వేసింది. మెల్బోర్న్ సిటీలో బ్రేక్ ఫాస్ట్ చేశామని సిరి తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అక్కడ నుంచి అడిలైడ్ వెళ్లారు. అన్నట్టు సిరి సిస్టర్ ఒకరు ఆస్ట్రేలియాలో ఉంటారు. వాళ్లను కలిసినట్టు కూడా ఉంటుంది. 'భైరవం' మల్టీస్టారర్ అయితే... నారా రోహిత్ సోలో హీరోగా 'సుందరకాండ' పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది. త్వరలో అది థియేటర్లలోకి రానుంది అని సమాచారం.

Also Readబ్రాహ్మణులు వర్సెస్ మంచు ఫ్యామిలీ - గొడవ ఎప్పుడు మొదలైంది? 'కన్నప్ప' కాంట్రవర్సీ ఏమిటి? డిటైల్డ్ స్టోరీ