తెలుగులో 'బిగ్ బాస్' సీజన్ 8తో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ కృష్ణ (Gautam Krishna). అందులో ఆయన రన్నరప్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సోలో బాయ్' (Solo Boy Movie). జూలైలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అదీ ఎప్పుడో తెలుసా?
జూలై 4న థియేటర్లలోకి 'సోలో బాయ్'Solo Boy Release Date: 'సోలో బాయ్' సినిమాకు నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పతాకం మీద సతీష్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. ఇందులో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను జూలై 4న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: బికినీలో 'సోలో బాయ్' హీరోయిన్ రమ్య పసుపులేటి గ్లామర్ ట్రీట్
రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''ఆల్రెడీ విడుదల చేసిన 'సోలో బాయ్' ఫస్ట్ లుక్ పోస్టర్, ఒక సాంగ్ ప్రేక్షకులను ఎంత గానో ఆకర్షిస్తున్నాయి. రిలీజ్ డేట్ పోస్టర్‌లో గౌతమ్ కృష్ణ, రమ్య పసుపులేటితో కలిసి కనిపించారు. ఇద్దరూ కాలేజీకి వెళ్తున్నట్టు అర్థం అవుతోంది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లుక్‌లో హీరో ఆకట్టుకున్నాడు. యూత్‌ఫుల్ కథతో, రొమాంటిక్ వైబ్‌తో, ఆడియన్స్ అందరినీ ఎట్రాక్ట్ చేసే ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమా తీశాం. ఫుల్ ఎంగేజ్ చేసే చిత్రమిది. ఇంతకు ముందు 'ఆకాశ వీధుల్లో'తో ఆకట్టుకున్న గౌతమ్ కృష్ణ... మరోసారి హిట్ అందుకోవడం గ్యారెంటీ'' అని చెప్పారు.
Solo Boy Cast And Crew: గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్థి, రమ్య పసుపులేటి హీరో హీరోయిన్లుగా నటించిన 'సోలో బాయ్'లో పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్: రిషిక - వీణాధరి, ఛాయాగ్రహణం: త్రిలోక్ సిద్ధు, సంగీతం: జుడా సంధ్య, సాహిత్యం: శ్యామ్ కాసర్ల - పూర్ణాచారి - చైతన్య ప్రసాద్ - కళ్యాణ్ చక్రవర్తి, నృత్య దర్శకత్వం: ఆటా సందీప్, నిర్మాణ సంస్థ: సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్, నిర్మాత: సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, దర్శకత్వం: పి. నవీన్ కుమార్.