న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా నటించిన 'సరిపోదా శనివారం' విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. థియేటర్లలో సూర్యగా ఆయన సందడి చేస్తున్నారు. ఈ సక్సెస్ జోష్‌లో కొత్త సినిమా 'హిట్ 3' (Hit 3 Movie) అనౌన్స్ చేశారు నాని. 'హంటర్స్ కమాండ్' పేరుతో ఆయన ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజే విడుదల తేదీ కూడా చెప్పడం విశేషం.


మే 1న థియేటర్లలోకి 'హిట్ 3'
Hit 3 Movie Release Date: వాల్ పోస్టర్ సినిమా పతాకం మీద యువ దర్శకులను పరిచయం చేస్తూ తన సమర్పణలో విజయవంతమైన సినిమాలు నిర్మించారు నాని. శైలేష్ కొలను ఆయన పరిచయం చేసిన దర్శకుడు. అతనితో 'హిట్', 'హిట్ 2' చేశారు. ఇప్పుడు 'హిట్ 3' చేస్తున్నారు. అయితే... ఈసారి చిత్ర సమర్పకుడిగా కాకుండా, హీరోగా నటిస్తున్నారు.


'హిట్ 2' పతాక సన్నివేశాల్లో 'హిట్ 3'లో హీరో నాని అని వెల్లడించారు. (Nani Role In Hit 3 Movie) అర్జున్ సర్కార్ పాత్రలో ఆయన కనిపిస్తారని చెప్పారు. అయితే... ఈ రోజు 'సరిపోదా శనివారం' తర్వాత తాను చేయబోయే సినిమా 'హిట్ 3' అని నాని స్పష్టం చేశారు. అంతే కాదు... వచ్చే ఏడాది మే 1న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తామని తెలిపారు.


Also Readహీరోయిన్లూ... బాధ్యత ఉండక్కర్లా? అనన్య నాగళ్ళ, స్రవంతిని చూసి సిగ్గు పడండి - కోట్లు కావాలి, ప్రజల కష్టాలు పట్టవా?



అర్జున్ సర్కార్... అతనే ఓ ప్రమాదం
నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్: ది థర్డ్ కేస్'ను వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ సంస్థలపై ప్రశాంతి త్రిపిర్‌నేని ప్రొడ్యూస్ చేస్తున్నారు. నాని 32వ చిత్రమిది. సినిమాను అధికారికంగా ప్రకటించిన సందర్భంగా విడుదల చేసిన వీడియో చూస్తే... 
మంచు కొండల మధ్య రహదారిలో ఓ పోలీస్ జీప్ వెళుతూ ఉంటుంది. 'సార్... బనిహాల్ పాస్ దగ్గర ఓ వైట్ బొలెరో వెళుతుంది. దానిని మీ ఆఫీసర్ నడుపుతున్నారా?' అని హెడ్ క్వార్ట్రర్స్‌లో ఉన్న పోలీసును అడుగుతారు. 'హా... అయితే' అని చెబితే... 'వెంటనే మీ అధికారిని వెనక్కి పిలవండి. అతను ప్రమాదంలో ఉన్నాడు' అని చెబుతారు. 'సరే సరే' అని లైట్ తీసుకుంటే... 'సరే అంటే ఏమిటి అర్థం' అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు 'మీరు ప్రమాదంలో ఎవరైతే ఉన్నారని అనుకుంటున్నారో అతనే ఓ ప్రమాదం' అని సమాధానం వస్తుంది. అప్పుడు అర్జున్ సర్కార్ పాత్రలో నానిని చూపించారు. ఆ విజువల్స్ స్టైలిష్‌గా, గ్రాండ్‌గా ఉన్నాయి.



Hit The Third Case Movie Cast And Crew: నాని కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాకు సౌండ్ మిక్స్: సురేన్ జి, లైన్ ప్రొడ్యూసర్: అభిలాష్ మందాధాపు, కాస్ట్యూమ్ డిజైనర్: నాని కామరుసు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్ వెంకట రత్నం (వెంకట్), కూర్పు: కార్తీక్ శ్రీనివాస్ ఆర్, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగల, ఛాయాగ్రహణం: సాను జాన్ వర్గీస్, సంగీత దర్శకత్వం: మిక్కీ జే మేయర్, నిర్మాణ సంస్థలు: వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్, నిర్మాత: ప్రశాంతి త్రిపిర్‌నేని, రచన - దర్శకత్వం: డాక్టర్ శైలేష్ కొలను.


Also Read: నివేదా థామస్ సినిమాకు నాని రివ్యూ - ఆమిర్ ఖాన్‌తో ఏ నటుడ్ని కంపేర్ చేశారంటే?