Nani Enjoying Court Movie Success Celebrations: నేచురల్ స్టార్ నాని 'కోర్ట్' (Court: The State Versus Nobody) మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకెళ్తూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ క్రమంలోనే మూవీ టీం సెలబ్రేషన్ ఆఫ్ ఆడియన్స్ వెర్డిక్ట్ ఈవెంట్ నిర్వహించింది.
స్టెప్పులేసిన నేచురల్ స్టార్
ఈ సందర్భంగా ఈవెంట్‌లో నాని (Nani) సరదాగా స్టెప్పులేశారు. ఆయనతో పాటు ప్రియదర్శి, హర్షి రోషన్, శ్రీదేవి సైతం స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. నాని తనదైన మార్క్‌లో డ్యాన్స్ చేయడంతో ఫ్యాన్స్, అక్కడున్న వారు ఎంకరేజ్ చేస్తూ జోష్ నింపారు. ఈ డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ కాగా.. ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా.. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన 'కోర్ట్: ది స్టేట్ వర్సెస్ నోబడి' మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా.. శివాజీ, రోహిణి, శుభలేఖ సుధాకర్, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.
అలా చేస్తే 'కోర్ట్' పాన్ ఇండియానే..
'కోర్ట్' మూవీ సీక్వెల్ చేస్తే అది పాన్ ఇండియా సినిమానే అని నాని అన్నారు. తాను ఈ రోజు వరకూ స్క్రిప్ట్, ఆడియన్స్ ఈ రెండు విషయాలనే నమ్మానని.. స్క్రిప్ట్ తమ టీంను గెలిపిస్తే.. తెలుగు ఆడియన్స్ సినిమాను గెలిపించారని అన్నారు. 'కోర్ట్ సినిమా విషయంలో టీం విషయంలో చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఈ వీకెండ్ ఓ పండుగలా గడిచింది. రానున్న రోజుల్లో కోర్ట్ పేరు మార్మోగుతుంది. సినిమాని ముందుకు తీసుకెళ్తున్న అందరికీ పేరుపేరునా థ్యాంక్స్. దర్శకుడు జగదీష్ నేను ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉన్నాడో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కూడా అలానే ఉన్నారు. రోషన్, శ్రీదేవి నటన అద్భుతం. ప్రియదర్శికి నటనలో ఓ స్టైల్ ఉంది. కోర్ట్ అనే బ్యూటీఫుల్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఈ సెలబ్రేషన్స్ త్రూ అవుట్ ది ఇయర్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా' అని నాని అన్నారు.
బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు
'కోర్ట్' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. విడుదలైన ఫస్ట్ రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.8 కోట్లకు పైగా వసూలు చేసింది. కేవలం 24 గంటల్లోనే బుక్ మై షోలో 21 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. అటు, అమెరికాలోనూ ఇప్పటికే $200K (దాదాపు రూ.2 కోట్లు) మార్కును దాటినట్లు తెలిపింది. ఫస్ట్ వీక్ పూర్తయ్యే సరికి ఇది $500K మార్కును దాటొచ్చని అంచనా వేసింది.
అసలు స్టోరీ ఏంటంటే..?
'పోక్సో' యాక్ట్ బ్యాక్ డ్రాప్‌లో కోర్ట్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. 2013లో జరిగిన కథ ఇది. ఇంటర్ ఫెయిలైన ఓ పేదింటి కుర్రాడు ఓ పెద్దింటి అమ్మాయితో ప్రేమలో పడగా.. అమ్మాయి మామయ్య అతనిపై కక్షతో పలు సెక్షన్లతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు పెడతాడు. ఈ క్రమంలో ఓ యువ లాయర్ యువకుని తరఫున వాదిస్తాడు. మరి అతను విజయం సాధించాడా..?, ఆ యువకుడు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు.? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.