'తగ్గేదే లే' అనేది అల్లు అర్జున్ పుష్ప డైలాగ్. రియల్ లైఫ్ వరకు వస్తే... ఆ మాట అనసూయకు పర్ఫెక్ట్ యాప్ట్. ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆవిడ అస్సలు తగ్గదు. అక్కడికక్కడ ఇచ్చి పడేస్తుంది. హోలీ సెలబ్రేషన్స్ కోసం వెళ్లిన ఒక వేడుకలో ఆంటీ అని కామెంట్ చేసిన వ్యక్తికి స్టేజి మీద నుంచి ఇచ్చి పడేసింది.


దమ్ముంటే స్టేజి మీదకు రా!
హోలీ సందర్భంగా మార్చి 14న హైదరాబాదులో నిర్వహించిన ఒక ఈవెంట్ లో స్టార్ యాక్ట్రెస్, ఒకప్పటి యాంకర్ అనసూయ సందడి చేశారు. అయితే ఆవిడ స్టేజి మీద ఉన్నప్పుడు ఆడియన్స్ అందరూ గుమిగూడారు. క్రౌడ్ లో ఉన్న ఒక వ్యక్తి అనసూయను ఆంటీ అని పిలిచాడు. అది ఆవిడ చెవిన పడింది. వెంటనే అతడికి ఇచ్చి పడేసింది.


ఆంటీ అని కామెంట్ చేసిన వ్యక్తిని అనసూయ గుర్తు పట్టింది.‌ అంతే కాదు అతడిని స్టేజ్ మీదకు రమ్మని పిలిచింది. దమ్ముంటే స్టేజ్ మీదకు రా అంటూ సవాల్ విసిరింది. 'నన్ను గనక రెచ్చగొడితే నేను ఏం చేయగలను చూపిస్తా' అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. 


Also Readపాకిస్థాన్ నుంచి ఇండియాకు రావడానికి పెద్ధ యుద్ధం చేసిన మహిళ ఉజ్మా అహ్మద్ కథతో... జాన్ అబ్రహం 'ది డిప్లొమాట్' సినిమా రివ్యూ






గతంలోనూ ఆంటీ కామెంట్స్!
అనసూయను ఆంటీ అని కామెంట్ చేయడం ఇది ఫస్ట్ టైం కాదు. ఈ నటి ఇంతకు ముందు సైతం ఇటువంటి కామెంట్లు ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా మంది ఆంటీ ఆంటీ అంటూ కామెంట్ చేయడం పట్ల అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. 


తన అబ్బాయిల స్నేహితులు ఎవరైనా ఆంటీ అంటే ఎటువంటి అభ్యంతరం లేదు అని, కొంత మంది సోషల్ మీడియాలో కావాలని పని కట్టుకుని మరి తనను ఆంటీ అని కామెంట్ చేస్తున్నారని, వాళ్లు ఆంటీ అని కామెంట్ చేయడం వెనుక డబల్ మీనింగ్ ఉందని అనసూయ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ కూడా ఇచ్చారు. హోలీ ఈవెంట్ దగ్గర కూడా అతను అదే తరహాలో ఆంటీ అని కామెంట్ చేసి ఉండొచ్చు అందుకే అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


Also Read'సూక్ష్మదర్శిని'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో... ఇప్పుడు 'పొన్‌మాన్‌'తో JioHotstarలోకి వచ్చాడు... గోల్డ్ రికవరీ కాన్సెప్ట్‌తో బసిల్ జోసెఫ్ ఏం చేశారంటే?