Nandini Reddy about Nithya Menen: కొందరు హీరోయిన్లు పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాను ఒప్పుకుంటారు. అలా లేకపోతే ఎన్నిరోజులు అయినా అలాంటి ఆఫర్లు వచ్చేవరకు ఎదురుచూస్తారు. రెండేళ్లకు ఒక సినిమా చేయడానికి అయినా వెనకాడరు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న అలాంటి హీరోయిన్లలో నిత్యా మీనన్ కూడా ఒకరు. ‘అలా మొదలయ్యింది’ అనే మూవీతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది నిత్యా మీనన్. అదే చిత్రంతో దర్శకురాలిగా పరిచయమయ్యారు నందినీ రెడ్డి. ఈ ఇద్దరికీ అదే మొదటి చిత్రం కాబట్టి వీరిద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. ఇక నందినీ రెడ్డి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ చేసిన సాహసం గురించి బయటపెట్టారు.
ఫ్యాన్స్ ఫిదా..
కొన్నిరోజుల క్రితం నందినీ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ‘అలా మొదలయ్యింది’ అనుభవాలను పంచుకున్నారు. దాంతో పాటు నిత్యా మీనన్‌ను ప్రశంసలతో ముంచేశారు. ఫైనల్‌గా ఆమె ప్రశంసలు వీడియో అటు తిరిగి, ఇటు తిరిగి నిత్యా మీనన్ ఫ్యాన్స్ దగ్గరికి వచ్చి చేరింది. దీంతో ఈ వీడియోను తెగ వైరల్ చేసేస్తున్నారు ఫ్యాన్స్. ‘అలా మొదలయ్యింది’ సినిమా తెరకెక్కించే సమయానికి నిత్యా మీనన్ వయసు 21 ఏళ్లే. అప్పటికే తను నిర్మాతలను కాదని, ఒక సీన్ చేయనని గట్టిగా చెప్పిందట. దీంతో తనకు కూడా ధైర్యం వచ్చి నిర్మాతలను ఎదిరించానని నందినీ రెడ్డి గుర్తుచేసుకున్నారు.
అప్పటికీ తను చిన్నపిల్లే..
‘‘ఒక సమయంలో నిత్యా మీనన్ తాగే సీన్‌ను రాయమన్నారు. కానీ నిత్యా మాత్రం.. నేను ఇది చేయను. ఇది కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావా? అని ప్రశ్నించింది. కానీ సినిమా పూర్తి చేయాలి కదా అని నేను అన్నాను. తను అప్పటికీ చిన్నపిల్లే. తనకు 21 ఏళ్లు మాత్రమే. అప్పుడే తనకు కాలేజీ అయిపోయింది. అప్పటికి సినిమాల్లేవు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేదు. అయినా కూడా.. వెళ్లి నిత్యా మీనన్ చేయను అంటుంది అని వాళ్లకి చెప్పు అంటూ నాకు సమాధానమిచ్చింది. ఆ మాట తను ఒక యాటిట్యూడ్‌తో చెప్పింది. ఒక అమ్మాయి నాతో ఇది చెప్తుందంటే నేను కూడా నాకోసం నిలబడాలి అని నేను గ్రహించాను. వెళ్లి నేను ఇది చేయను అని నిర్మాతతో చెప్పేశాను. నేను ఇది షూట్ చేయను. కావాలంటే మీరే షూట్ చేయండి అన్నాను’’ అంటూ అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు నందినీ రెడ్డి.
నిత్యా మీనన్ వల్లే..
‘‘అదే మొదటిసారి నేను నాకోసం నిలబడడం. అది కూడా నిత్యా మీనన్ వల్లే’’ అని నందినీ రెడ్డి తెలిపారు. ఇక ‘అలా మొదలయ్యింది’.. నందినీ రెడ్డికి మొదటి సినిమానే అయినా.. అదే తనకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో హీరోహీరోయిన్లుగా నటించిన నాని, నిత్యామీనన్‌కు కూడా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చేలా చేసింది. అలా నిత్యామీనన్.. తనకు నచ్చకపోతే అస్సలు చేయదని, నిర్మాతల మొహం మీదే చెప్పేస్తుందని ఇప్పటికీ ఇండస్ట్రీలో తనకు పేరు ఉంది. అలనాటి నటీమణి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ‘మహానటి’లో నిత్యా మీననే యాక్ట్ చేయాల్సింది. కానీ అందులో మందు తాగే సీన్స్ ఉన్నాయని ఈ భామ.. అలాంటి ఆఫర్‌ను కూడా వదులుకోవడానికి సిద్ధపడింది.
Also Read: బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై స్నేహితుడు అత్యాచారం - కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి..