Srimanthudu Case: 2015లో విడుదలయిన ‘శ్రీమంతుడు’ సినిమాపై ఇప్పుడు కాంట్రవర్సీలు మొదలయ్యాయి. మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీపై కాపీరైట్స్ కేసు నమోదయ్యింది. రైటర్ శరత్ చంద్ర అలియాస్ ఆర్‌డీ విల్సన్ ఈ కాపీరైట్ కేసును నమోదు చేశారు. తన ‘చచ్చేంత ప్రేమ’ కథ నుంచి ‘శ్రీమంతుడు’ని కాపీ కొట్టారని ఆరోపించారు. ఇక ఈ విషయంపై ఇండస్ట్రీలో అనేక అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఆర్‌డీ విల్సన్ కరెక్ట్ అంటే.. కొందరు కొరటాల శివ కరెక్ట్ అంటున్నారు. ఊరి పేరును మినహాయించి ‘శ్రీమంతుడు’ అనేది ‘చచ్చేంత ప్రేమ’ సీన్ నుంచి సీన్ అంతా కాపీ అని ఆరోపించారు.


క్రియేటివ్ టీమ్ ప్రకటన..


తన కథను కాపీ కొట్టినందుకు ‘శ్రీమంతుడు’ మేకర్స్.. తనకు డబ్బును ఇవ్వాలని తాను కోరుకోవడం లేదని శరత్ చంద్ర ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ ఆయనకు క్రెడిట్ కావాలని మాత్రం అడిగారు. కొరటాల శివ.. తనకు ఓపెన్‌గా క్షమాపణలు చెప్పాలని లేదా తనను జైలుకు పంపిస్తానని శరత్ చంద్ర వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ విషయంపై ‘శ్రీమంతుడు’ మేకర్స్ తాజాగా స్పందించారు. ‘శ్రీమంతుడు క్రియేటివ్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన’ అంటూ ఒక స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు. అంతే కాకుండా ముందే ఏ అంచనాలకు రావద్దని మీడియాను కోరారు. ప్రస్తుతం చట్టపరమైన చర్యలు సాగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు.






అప్పుడు తేడా అర్థమవుతుంది..


‘శ్రీమంతుడు’ క్రియేటివ్ టీమ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ‘‘చచ్చేంత ప్రేమకు నవలకు, కొరటాల శివ తెరకెక్కించిన శ్రీమంతుడుకు పోలికలు ఉన్నాయని ఆరోపణలపై మాట్లాడడానికి ఈ ప్రకటన విడుదల చేస్తున్నాం. ఈ రెండు కథల కథనాలు వేర్వేరుగా ఉన్నాయి. ఎక్కడా ఈ రెండిటికీ సంబంధం లేదు. సినిమాను, పుస్తకాన్ని రెండిటినీ చూసినవారికి ఈ తేడా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయం లీగల్ రివ్యూలో ఉంది. ఇంకా దీనిపై తీర్పులు ఏం రాలేదు. అందుకే ముందే అంచనాలకు రావద్దని మీడియాను కోరుతున్నాం’’ అంటూ ఇప్పుడే ఈ ఘటనపై అన్ని విషయాలు బయటపెట్టడం కుదరదని క్లారిటీ ఇచ్చారు.


అది మా ఆలోచన..


‘శ్రీమంతుడు అనేది మా ఆలోచన. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని దానిని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన ఉన్నవారికి నిదర్శనం. చట్టపరమైన చర్యలు కొనసాగుతున్న క్రమంలో ఓపిక, నమ్మకం ఉండాలని కోరుతున్నాను. మమ్మల్ని నమ్మినందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్’ అంటూ ఈ స్టేట్‌మెంట్‌లో క్లారిటీ ఇచ్చింది. మహేశ్ బాబుకు ‘శ్రీమంతుడు’ ముందు పెద్దగా హిట్స్ లేవు. ఈ మూవీతోనే తను మళ్లీ ఫార్మ్‌లోకి వచ్చాడు. కలెక్షన్స్ విషయంలో కూడా ‘శ్రీమంతుడు’ బ్లాక్‌బస్టర్‌ను సాధించింది. ఇక ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాపై కాంట్రవర్సీలు క్రియేట్ అవ్వడంతో మహేశ్ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. కానీ మూవీ మేకర్స్ మాత్రం తమ తప్పు ఏమీ లేదని బలంగా నమ్ముతున్నారు. 


Also Read: బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై స్నేహితుడు అత్యాచారం - కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి..