Subhashree Devil Movie Song: బిగ్ బాస్ రియాలిటీ షోలోకి కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టి బయటకు వచ్చాక మంచి అవకాశాలు సంపాదించుకుంటున్నారు. సినిమాలతో పాటు సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరు శుభశ్రీ రాయగురు. బిగ్ బాస్ సీజన్  7లో పాల్గొని చక్కటి ఆట తీరుతో ఆకట్టుకుంది. నా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే డైలాగ్ తో బాగా పాపులర్ అయ్యింది. గౌతమ్ కృష్ణతో నడిపిన లవ్ ట్రాక్ ప్రేక్షకులు భలే ఎంటర్ టైన్ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో తమిళ సినిమా ‘డెవిల్’ ఒకటి.  


గ్లామర్ డోస్ పెంచేసిన శుభశ్రీ


ఆదిత్య దర్శకత్వం వహించిన ‘డెవిల్’ మూవీకి సంబంధించి తాజాగా ఓ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ‘కమ్ అండ్ కిస్ మి’ అంటూ సాగే ఈ పాటలో సరికొత్త శుభశ్రీ దర్శనం ఇచ్చింది. లిప్ లాక్స్, హాట్ సీన్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులురేపింది. బ్లాక్ డ్రెస్సులో అందాలను ఆరబోస్తూ అలరించింది. మొత్తం ఒకే గదిలో చిత్రీకరించిన ఈ పాటలో గ్లామర్ డోస్ పెంచి సెగలు పుట్టించేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విధార్థ్, త్రిగుణ, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.



ఒడిశాలో పుట్టి పెరిగిన శుభశ్రీ


ఇక శుభశ్రీ ఒడిశాల్లో పుట్టి పెరిగింది. ముంబైలో LLB పూర్తి చేసింది. ఆ తర్వాత లాయర్ గా ప్రాక్టీస్ చేసింది. అయితే, సినిమాలు అంటే ఇష్టం ఉండటంతో మోడలింగ్ వైపు అడుగు పెట్టింది. 2020లో VLCC ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విన్నర్ టైటిల్ అందుకుంది. ఆ తర్వాత టీవీ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత కొన్ని హిందీ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించింది. 2022లో ‘రుద్రవీణ’ సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అమిగోస్’, ‘కథ వెనుక కథ’ లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అటు పవన్ కల్యాణ్ ‘OG’ సినిమాలోనూ ఓ కీలక పాత్ర చేస్తోంది.   


బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా ఎంట్రీ


ఇక బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. చక్కటి ఆట తీరుతో అలరించింది. ఒకానొక సమయంలో అమర్ దీప్ తో గొడవ పడి నా మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ కంటతడి పెట్టింది. అప్పటి నుంచి శుభశ్రీ మీద బోలెడు మీమ్స్ వచ్చాయి. బిగ్ బాస్ షో నుంచి బయకు వచ్చాక ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించింది. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కలిసి వ్లాగ్స్ చేసి నెటిజన్లను అలరించింది. అటు భోలేతో కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్ కూడా చేసింది. ఇక ప్రస్తుతం శుభశ్రీ తన తొలి మూవీ ‘డెవిల్’ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.


Read Also: గోపీచంద్‌కు పోటీగా ఆనంద్ దేవరకొండ - 'గం గం గణేశా' రిలీజ్ డేట్ ఫిక్స్?