Bigg Boss Contestant: తన ఫ్రెండ్ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి రేప్ చేశాడంటూ ఒక మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఢిల్లీ పోలీసులను ఆశ్రయించడం సెన్సేషన్‌గా మారింది. జనవరి 31న తన ఫ్రెండ్‌పై కేసును నమోదు చేయడానికి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, టీవీ నటి పోలీసులను ఆశ్రయించింది.


సౌత్ ఢిల్లీలోని ఒక ఫ్లాట్‌లో తనను రేప్ చేశారని పేర్కొంది. తను ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2023లో డియోలి రోడ్ ఫ్లాట్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ‘‘ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 376 (రేప్) ప్రకారం కేసు నమోదు చేసుకున్నాం. తిగ్రీ పోలీస్ స్టేషన్‌లో ఒక వ్యక్తిపై కేసు నమోదయ్యింది. ఇంకా అరెస్టులు ఏమీ జరగలేదు. ఈ విషయంపై విచారణ జరపడానికి టీమ్స్‌ను ఏర్పాటు చేశాం’’ అంటూ ఒక సీనియర్ పోలీస్ అధికారి ఈ కేసుకు సంబంధించిన వివరాలను బయటపెట్టారు. 


డ్రింక్‌లో మత్తుమందు..


బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. నిందితుడు తనను ఒకరోజు ఇంటికి పిలిచాడు. అక్కడే తనకు ఫుడ్‌ను ఆఫర్ చేశాడు. తనకు ఇచ్చిన డ్రింక్‌లో మత్తుమందు కలిపాడు. మైకంలో ఉన్నప్పుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇప్పటికే పోలీసులు విచారణ కోసం రంగంలోకి దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు ఈ విషయంపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. బాధితురాలు.. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించి మెల్లగా సీరియల్స్‌తో పాపులారిటీని సంపాదించుకుంది.


Also Read: RC16 టాలెంట్ హంట్ - రామ్ చరణ్ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్!