కథానాయకుడిగా నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ప్రయాణం భిన్నమైనది. ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్తదనం అందించడానికి, కొత్త తరహా కథలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన కొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 


కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'డెవిల్' (Devil Indian Movie). ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉపశీర్షిక. చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్, హీరోయిన్ సంయుక్తా మీనన్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ దిగిన సెల్ఫీని చిత్ర బృందం విడుదల చేసింది. 


విడుదల తేదీ... త్వరలో!
'డెవిల్' రషెస్ చూసిన చిత్ర బృందం సినిమా మీద కాన్ఫిడెంట్ గా ఉంది. పాన్ ఇండియా ప్రేక్షకులకు సినిమా చూపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో వెల్లడించనున్నారు. 


Also Read : రజనీకాంత్, 'దిల్' రాజు సినిమాకు దర్శకుడు అతడేనా?






500 మందితో భారీ క్లైమాక్స్!
Devil Action Scene with 500 Members : 'డెవిల్' సినిమాను దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఇది పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. భారీ స్థాయిలో సినిమా నిర్మాణం జరిగింది. 


'డెవిల్' క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ భారీగా ఉంటాయని నిర్మాత అభిషేక్ నామా తెలిపారు. సుమారు 500 మంది ఫైటర్లు, ఇతర తారాగణం పాల్గొనగా... భారీ యాక్షన్ సీక్వెన్స్ తీశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వచ్చిన యాక్షన్ సీక్వెన్సుల్లో ఈ యాక్షన్ ఎపిసోడ్ ఒకటిగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. స్టంట్ మాస్టర్ వెంకట్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీన్ తెరకెక్కింది. 


చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ''మా సంస్థలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 'డెవిల్' సినిమాను భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిస్తున్నాం. కొత్త సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే త‌ప‌న ఉన్న మా నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ మ‌రో వైవిధ్యమైన గెటప్, నటనతో ఆక‌ట్టుకోబోతున్నారు. సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ వావ్ అనేలా ఉంటుంది. త్వరలో విడుదల తేదీ గురించి వెల్లడిస్తాం'' అని చెప్పారు. 


కళ్యాణ్ రామ్ అండ్ పీరియాడిక్ డ్రామా అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది 'బింబిసార' సినిమా. దానిని పీరియాడిక్ డ్రామా అనలేం. అదొక సోషియో ఫాంటసీ సినిమా. ఫర్ ద ఫస్ట్ టైమ్... మహారాజు రోల్ చేశారు కళ్యాణ్ రామ్ . ఆ క్యారెక్టర్ కోసం కాలంలో కొంచెం వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు 'డెవిల్'లో రోల్ కోసం కూడా కాలంలో వెనక్కి వెళ్ళారు. ఆల్రెడీ విడుదల అయిన ఆయన లుక్ చూస్తే డిఫరెంట్ గా ఉందని చెప్పాలి. రెగ్యులర్ గా చూసే కళ్యాణ్ రామ్ కి, 'డెవిల్'లో కళ్యాణ్ రామ్ కి డిఫరెన్స్ ఉంది. సినిమా కూడా అంతే వైవిధ్యంగా ఉంటుందని టాక్. 'డెవిల్' సినిమాకు ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  గాంధీ న‌డికుడిక‌ర్‌, కూర్పు : త‌మ్మిరాజు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు : శ్రీకాంత్ విస్సా, ఛాయాగ్రహణం : సౌంద‌ర్ రాజన్‌ .ఎస్, సంగీతం : హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్.  


Also Read 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?