నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒక సినిమా నిర్మిస్తోంది. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం వహిస్తున్నారు. 'సింహం వేట మొదలు' అంటూ ఆల్రెడీ టీజర్ విడుదల చేశారు. 'మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్. నా జీవో గాడ్స్ ఆర్డర్', 'భయం నా బయోడేటాలోనే లేదురా బోసు డీకే' అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగులు అభిమానులను అలరించారు.
బాలకృష్ణకు 107వ చిత్రమిది (NBK 107). టీజర్, బాలకృష్ణ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... ఇందులో వైట్ అండ్ వైట్ వేసిన నట సింహం లుక్ లీక్ అయ్యింది. బ్లాక్ షర్ట్ వేసి, పంచెకట్టిన బాలకృష్ణ లుక్ విడుదల చేశారు. ఇది కాకుండా మరో లుక్ ఉందని లేటెస్టుగా లీక్ అయిన వీడియో చూస్తే తెలుస్తోంది.
టెంపుల్‌లో బాలకృష్ణ, కొంత మంది డ్యాన్సర్లు పాల్గొనగా సాంగ్ షూటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో వైట్ అండ్ వైట్ డ్రస్‌లో హీరో కనిపించారు. షాట్ గ్యాప్‌లో బాలకృష్ణ స్నాక్స్ తీసుకుంటున్న ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఈ సినిమా సెట్స్ నుంచి ఇలా ఫోటోలు లీక్ కావడం గతంలోనూ జరిగింది. మరోసారి ఇలా జరగకుండా చూడాలని బాలకృష్ణ ఫ్యాన్స్ కోరుతున్నారు. లేదంటే ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ మిస్ అవుతారని అంటున్నారు.
బ్లాక్ బస్టర్ 'అఖండ' తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రమిది. అలాగే, 'క్రాక్' విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్.
ఇందులో హానీ రోజ్ (Honesy Rose) రెండో కథానాయిక. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. మోడల్ కమ్ హీరోయిన్, 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో చేశారు. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన తారాగణం. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : అంచనాలు ఆకాశాన్ని అందుకునేలా చేసిన పూరి - విజయ్ దేవరకొండ 'లైగర్' ట్రైలర్ వచ్చేసింది