Naga Chaitanya at Ira Khan Reception: తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి ఘనంగా జరిగింది. బాలీవుడ్ సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ నుపూర్ షికారేతో చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఐరా.. ఫైనల్‌గా తనను పెళ్లి చేసుకుంది. ఇప్పటికీ వీరిద్దరి పెళ్లి గురించి బాలీవుడ్‌లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఐరా ఖాన్, నుపూర్ షిఖారే పెళ్లికి సంబంధించిన అన్ని ఈవెంట్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక వీరి పెళ్లి రిసెప్షన్‌కు నాగచైతన్య హాజరయిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. నాగచైతన్యతో కలిసి దిగిన ఫోటోను ఐరా ఖాన్.. స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
నాగచైతన్యకు మాత్రమే ఆహ్వానం..
ఐరా ఖాన్, నుపూర్ షికారే పెళ్లి కాస్త భిన్నంగా జరిగింది. భిన్నంగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చాలామంది ఉంటుంది. కానీ నుపూర్.. అది చేసి చూపించాడు. తన ఇంటి దగ్గర నుండి పెళ్లి మండపానికి జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. దాదాపు 8 కిలోమీటర్లు జాగింగ్ చేసిన తర్వాత అదే డ్రెస్‌లో పెళ్లితంతులో పాల్గొన్నాడు. ఈ ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. ఇక రిసెప్షన్‌కు మాత్రం ఐరా ఖాన్, నుపూర్ షికారే సింపుల్‌గా, అందంగా రెడీ అయ్యారు. పెళ్లి తర్వాత జరిగిన రిసెప్షన్ కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీల కోసం మరొక ప్రత్యేకమైన రిసెప్షన్‌ను ఏర్పాటు చేశాడు అమీర్ ఖాన్. ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా హాజరయ్యాడు.
‘లాల్ సింగ్ చడ్డా’తో స్నేహం మొదలు..
ఐరా ఖాన్, నుపూర్ షికారే పెళ్లికి దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలు అందరికీ ఆహ్వానం అందింది. కానీ టాలీవుడ్ సెలబ్రిటీలను మాత్రం ఈ ఈవెంట్‌కు హాజరు కాలేదు.. ఒక్క నాగచైతన్య తప్పా. 2022లో విడుదలయిన ‘లాల్ సింగ్ చడ్డా’ అనే సినిమాలో అమీర్ ఖాన్, నాగచైతన్య కలిసి నటించారు. ఇందులో అమీర్ హీరోగా నటించగా.. నాగచైతన్య కీలక పాత్రలో కనిపించాడు. ఈ మూవీ ద్వారా బాలీవుడ్‌లో డెబ్యూ ఇచ్చాడు చై. అంతే కాకుండా ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రమోషన్స్ కోసం అమీర్‌తో కలిసి యాక్టివ్‌గా పాల్గొన్నాడు. అప్పటినుండి అమీర్ ఖాన్, నాగచైతన్యలకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అందుకే తన కూతురు ఐరా ఖాన్ రిసెప్షన్‌కు టాలీవుడ్ నుండి కేవలం చైతూను మాత్రమే ఆహ్వానించాడు అమీర్.
ముంబాయ్ తర్వాత శ్రీలంకలో..
ఇక తన రిసెప్షన్‌లో నాగచైతన్యతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘మనం కలిసి ఒక ఫోటో దిగాం. ఇప్పుడు వచ్చి హ్యాంగ్ అవ్వండి’ అంటూ ఆహ్వానించింది ఐరా ఖాన్. ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చైతూను ట్యాగ్ కూడా చేసింది. ముంబాయ్‌లో జరిగిన ఈ రిసెప్షన్‌కు హాజరయిన చైతూ.. సీనియర్ నటుడు అనిల్ కపూర్‌తో కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముంబాయ్‌లో పెళ్లి కార్యక్రమాలు అన్నీ ముగిసిన తర్వాత శ్రీలంకకు వెళ్లి క్రిస్టియన్ స్టైల్‌లో పెళ్లి చేసుకున్నారు ఐరా ఖాన్, నుపూర్ షికారే. ఈ క్రిస్టియన్ వెడ్డింగ్‌కు సంబంధించిన వీడియో టీజర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఐరా.
Also Read: నటి కావాల్సిన రేఖ చెల్లెలు రాధ - ఆ ఒక్క తప్పుతో జీవితం మారిపోయిందిగా!