'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలోని 'నాటు నాటు...' (Naatu Naatu Song)కు ఆస్కార్స్ (Oscars 2023) అవార్డు వచ్చినప్పటి నుంచి ఆ ఘనత  ప్రధాన పాత్ర ఎవరిదంటూ సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ. మన దర్శక ధీరుడు జక్కన్న (SS Rajamouli) అని కొందరూ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అని అతని ఫ్యాన్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) అని అతని ఫ్యాన్స్. అయితే, ఈ ఆస్కార్ వెనుక ఇంకా ఎన్నో ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందరి కన్నా ముఖ్యమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరో తెలుసుకొండి మరి!



  1. నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చింది కదా. ఆ పాట సందర్భాన్ని రప్పించిన..... ఆ ఇంగ్లీష్ క్యారెక్టర్ ఎడ్యుర్డ్ బుహాక్ కీ ఫ్యాక్టర్ కాదా....

  2. అసలు ఆ పార్టీకి భీమ్ ను ఆహ్వానించిన ఒలీవియా మోరిస్... అదే జెన్నిఫర్ ది కదా ఆస్కార్ లో కీలక పాత్ర?

  3. అక్కడ భీమ్ కిందపడితే ఆదుకున్నాడు కదా.... అప్పుడే కదా రామ్ నాటు నాటు పాడేది. అలా చూస్తే రామ్ చరణ్ వల్లే కదా ఆస్కార్ వచ్చింది?

  4. జెన్నీ తనొక్కడ్నే పిలిచినా సరే రామ్ ను కూడా తీసుకెళ్లినది భీమే కదా. సో తారక్ వల్లే ఆ సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి అతని వల్లే కదా ఆస్కార్?

  5. అసలు తారక్ ను ఢిల్లీ దాకా రప్పించేలా చేసింది... కొమ్మా ఉయ్యాలా అంటూ పాట పాడిన మల్లి పాత్రధారి ట్వింకిల్ శర్మే కదా. అంటే ఆస్కార్ లో ఆమెది కూడా కాదనలేని పాత్రే కదా?

  6. అసలు మల్లి దగ్గర టాటూ వేయించుకోవాలనుకున్న ఐడియా లేడీ బక్స్టన్ కు రాకపోయి ఉంటే...? మల్లి టైంపాస్ కోసం పాట పాడేదా...? ఆ పాట నచ్చి తీసుకెళ్లిపోయేవారా..? తారక్ దిల్లీకి వచ్చి నాటు నాటు ఆడేవాడా..?

  7. వేటకు వెళ్లిన గవర్నర్ స్కాట్ బక్స్టన్ అంత లేట్ చేశాడు కాబట్టే.... లేడీ బక్స్టన్ కు బోర్ కొట్టి టాటూ వేయించుకుంది. సో వేటకు వెళ్లిన గవర్నర్ ఎంత ముఖ్యం..? 
    ఏడు పాయింట్లు అయిపోయాయండీ. ఇక మిగిలింది ఆఖరి పాయింట్. నాకు తెలిసినంత వరకు ఆస్కార్ రావడానికి ముఖ్యమైన కారణం ఇతనే. మీరు ఎవరూ ఊహించకపోయి ఉండొచ్చు.

  8. ఆఖరిగా 8వ పాయింట్.... లేడీ బక్స్టన్ కు పాట నచ్చి ఏవో  రెండు కాయిన్స్ విసిరిందే అనుకోండి... ఏదో పెద్ద అంతర్జాతీయ స్థాయి దుబాసీ ట్రాన్సలేషన్ స్కిల్స్ ఉన్నట్టు.... పాటకు బహుమానం ఇచ్చిందీ తీసుకో.... అని మల్లి తల్లికి చెప్పిన ఛత్రపతి శేఖర్.... అదే జంగు. అతని వల్లే కథ ఇక్కడి దాకా వచ్చింది. అంటే ఇన్ని లేయర్స్ చూసుకుంటూ వెళ్తే.... జంగు చేసిన పూర్ ట్రాన్సలేషన్ స్కిల్స్ వల్లే మల్లిని తీసుకుపోయారు. భీమ్ ఢిల్లీకి వచ్చాడు. జెన్నిని చూశాడు. అల్లూరితో దోస్తీ. పార్టీ ఇన్విటేషన్. భీమ్ కు అవమానం. ఇక ఫైనల్లీ నాటు నాటు.


Also Read : రోజుకు రెండు కోట్లు - రెమ్యూనరేషన్ రివీల్ చేసిన పవన్