Must Watch Films in 2025 |  మలయాళ ఇండస్ట్రీ 2024లో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించింది. కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో గత ఏడాది మలయాళ సినిమాల నామస్మరణ జరిగింది. ఇక ఈ ఏడాది కూడా పలు మోస్ట్ అవైటింగ్ మలయాళ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అందులో అనుష్క ఫస్ట్ మలయాళ సినిమా కూడా ఉంది. జనవరి నుంచి 


ఐడెంటిటీ (Identity)
టోవినో థామస్, త్రిష కృష్ణన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ 'ఐడెంటిటీ'. ఇందులో వినయ్ రాయ్, అజు వర్గీస్, అర్చన కవి, రెబా మోనికా జాన్ కీలక పాత్రలు పోషిస్తుండగా , అఖిల్ పాల్ అండ్ అనస్ ఖాన్ దర్శకత్వం వహించారు. సరికొత్త కథతో, గ్రిప్పింగ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇవ్వడం ఖాయం. 'ఐడెంటిటీ' 2025 జనవరి 2న రిలీజ్ కాబోతోంది. 


ఎన్ను స్వంతం పుణ్యాలన్
అర్జున్ అశోకన్, బాలు వర్గీస్, అనశ్వర రాజన్, రెంజి పనికర్, అల్తాఫ్ సలీం, బైజు సంతోష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా మహేష్ మధు దర్శకత్వంలో రూపొందింది. ఎమోషనల్ డ్రామా 'పుణ్యాలన్ అగర్బత్తీస్‌'కు సీక్వెల్ ఈ మూవీ. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మలయాళ సినిమా జనవరి 10న థియేటర్లలోకి రానుంది. 


డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ 
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబోలో వస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ 'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్'. ఈ సినిమాలో లీనా, సిద్ధికి, విజయ్ బాబు, విజి వెంకటేష్, గోకుల్ సురేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ ఫేరర్ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' మూవీని జనవరి 23న రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు.‌ 


తుదరం
మోహన్‌లాల్, శోభన, ఫర్హాన్ ఫాసిల్, మణియంపిల్ల రాజు, బిను పప్పు, నందు, ఇర్షాద్ అలీ, ఆర్ష చాందిని బైజు వంటి స్టార్స్ నటిస్తున్న మలయాళ డ్రామా 'తుదరం'. దర్శకుడు తరుణ్ మూర్తి తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 30న రిలీజ్ కానుంది. 


రాచెల్
ఆనందిని బాలా - దర్శకుడు హనీ రోజ్ కాంబోలో వస్తున్న ఇంటెన్స్ థ్రిల్లర్ 'రాచెల్'. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యి, అంచనాలను పెంచేసింది. ఈ మలయాళ సినిమాతో గ్రిప్పింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు ఇస్తామని అంటున్నారు మేకర్స్.  


 


L2: ఎంపురాన్
మోహన్‌లాల్, మంజు వారియర్, పృథ్వీరాజ్, టోవినో థామస్, ఇంద్రహిత్ సుకుమారన్ వంటి పవర్ హౌస్ స్టార్స్ నటిస్తున్న మలయాళ భారీ బడ్జెట్ సినిమా 'L2: ఎంపురాన్'. ఇది గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ 'లూసిఫర్'కు సీక్వెల్. ఈ సినిమాకు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


కథనార్: ది వైల్డ్ సోర్సెరర్
జయసూర్య, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్న మరో మలయాళ మోస్ట్ అవైటింగ్ మూవీ 'కథనార్ : ది వైల్డ్ సోర్సెరర్'. రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో అనుష్క మాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. ఈ చారిత్రాత్మక ఫ్యాంటసీ సినిమా 2025 ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.


Also Readమహేష్ బాబు - రాజమౌళి సినిమా పూజ ఎక్కడ, ఎన్ని గంటలకు జరుగుతుందంటే?