Music Director GV Prakash And wife Saindhavi To Part Ways?: సినీ ఇండస్ట్రీలో ప్రేమ, విడాకులు అనేవి సాధారణం. ఒక జంట ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదర్చిన వివాహమైన ఏదోక కారణంతో విడిపోతుంటారు. అలా నార్త్ నుంచి సౌత్ వరకు సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి చేసుకుని విడిపోయ జంటలు ఎన్నో ఉన్నాయి. రెండేళ్ల క్రితం హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌ల విడాకుల ప్రకటన ఇండస్ట్రీ వర్గాలతో పాటు సాధారణ ప్రజలకు కూడా షాకిచ్చింది. 18 ఏళ్ల పాటు అన్యోన్యంగా కలిసి ఉన్న ఈ జంట విడిపోవడాన్ని అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు.
అప్పుడు ధనుష్.. ఇప్పుడు జీవీ
ఇప్పుడు ధనుష్ మాదిరిగానే అతడి స్నేహితుడు, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేస్తూ "ఎంతో ఆలోచించాం. చివరికి విడిపోవాలని నేను, సైంధవి నిర్ణయించుకున్నాం. పరస్పర అంగీకారంతోనే మా విడాకులు.. మా ఈ నిర్ణయాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకుంటారని, అలాగే మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. మా నిర్ణయం ఇద్దరికి మంచిదని భావించిన తర్వాతే విడాకులకు సిద్ధమయ్యాం" అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్త తమిళనాట సంచలనం రేపుతుంది. వీరిద్దరు విడిపోవడంపై అభిమానులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జీవీ ప్రకాశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌లో జీవి ప్రకాష్ ఒకరు. సంగీత దర్శకుడు మాత్రమే కాదు మంచి నటుడు కూడా. ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్ రెహమాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన జీవి ప్రకాశ్ తక్కువ సమయంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. అంతేకాదు సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక 2013లో గాయనీ సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి కూతురు అన్వీ కూడా ఉంది.
వచ్చేనెల జూన్ లో 11వ వెడ్డింగ్ యానివర్సరీ.. అంతలోనే
దాదాపు దశాబ్ధంపైగా అన్యోన్యంగా జీవించిన ఈ జంట ఇప్పుడు విడిపోవడాన్ని సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా సైంధవి - జీవీ ప్రకాష్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఇద్దరు కలిసే పెరిగారు. జీవీ మ్యూజిక్ నేర్చుకుని సంగీత దర్శకుడు అయ్యాడు.. సైంధవ్ సంగీతం నేర్చుకుని గాయనీ అయ్యింది. ఇద్దరు కలిసి పలు షోలు కూడా చేశారు. ఈ క్రమంలో వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారం 2013లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఓ కూతురు అన్వీ కూడా ఉంది. ఇక వీరి పెళ్లి జరిగి దశాబ్ధ కాలం అయిపోయింది. మరో నెలలలో వీరి 11వ వెడ్డింగ్ యానివర్సరీ కూడా రానున్న క్రమంలో ఈ జంట విడాకులు వార్తలు వినడం విచారం.
Also Read: బతికి ఉన్న మా నాన్నను ఈ లోకం విడిచి వెళ్లిపో అన్నాను - తండ్రి మృతిపై మనోజ్ బాజ్‌పాయి ఎమోషనల్