Mrunal Thakur & Shahid Kapoor: 'సీతారామం', 'హాయ్ నాన్న‌'.. తెలుగులో చేసిన ఈ  రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి మృణాల్ కి. ఇక రెండు సినిమాల్లో ఆమె యాక్టింగ్, క‌ట్టు, బొట్టు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. తెలుగింటి అమ్మాయిలా చ‌క్క‌గా ఉందంటూ ప్ర‌శంస‌లు వ‌చ్చాయి మృణాల్ కి. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఆమె. ఈ మ‌ధ్యే 'ఫ్యామిలీ స్టార్' తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఎన్నో హిందీ సీరియ‌ల్స్ లో న‌టించిన మృణాల్.. షాహిద్ క‌పూర్ తో క‌లిసి ‘జర్సీ’ సినిమాలో చేసింది. అయితే, మృణాల్  అభిమాన హీరో షాహిద్ క‌పూర్ అంట‌. అందుకే, ఆయ‌న‌తో న‌టించేట‌ప్పుడు ఒక సీన్ చేసేందుకు ఆమెకు మూడు గంట‌లు ప‌ట్టింద‌ట‌. 


చెంప దెబ్బ సీన్.. 


మృణాల్ ఠాకూర్‌కు షాహిద్ క‌పూర్ అంటే అభిమానం. దీంతో ఆయ‌న‌తో క‌లిసి న‌టించేందుకు ఆఫ‌ర్ రావ‌డంతో చాలా చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యారంట మృణాల్ ఠాకూర్. షాహిద్ షూట్ లో త‌న‌ని చూసి స్మైల్ చేసిన‌ప్పుడు చాలా హ్యాపీగా అనిపించేద‌ని ఆమె గ‌తంలో ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అయితే, ఆ షూట్ టైంలో ఒక స‌న్నివేశం అంద‌రికీ చాలా న‌వ్వు తెప్పించ‌ద‌ట‌. అదే షాహిద్ క‌పూర్‌ను చెంప మీద కొట్ట‌ే సీన్. ఈ సినిమాలోని ఒక సీన్‌లో హీరోయిన్.. హీరోను చెంప మీద కొడుతుంది. అయితే, ఆ సీన్ త‌ను న‌టించ‌న‌ని మొండికేసింద‌ట మృణాల్. షాహిద్ క‌పూర్‌ను కొట్ట‌లేను అని చేయ‌ను అని చెప్పింద‌ట‌. చివ‌రికి క‌న్విన్స్ చేయ‌డంతో ఆమె ఆ సీన్ చేసేందుకు ఒప్పుకున్నారు. 


మూడు గంట‌లు.. 


ఆ సీన్ చేసేందుకు ఒప్పుకున్న మృణాల్ ఠాకూర్.. చాలా స్లోగా, టైం తీసుకుని చేస్తాన‌ని అన్నార‌ట‌. అప్పుడు డైరెక్ట‌ర్ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని ఊహించుకుని ఈ సీన్ చేయ‌మ‌ని చెప్ప‌ర‌ట మృణాల్‌కు. అయితే, ఆ ఒక్క సీన్ చేయ‌డానికి  మూడు గంట‌లు టైం ప‌ట్టింద‌ట‌. మృణాల్ మొహ‌మాటాన్ని చూసి హీరో కూడా న‌వ్వుకున్నార‌ట‌. 


తెలుగులో నాని.. 


'జెర్సీ' సినిమా తెలుగులో నాని న‌టించిన విష‌యం తెలిసిందే. 2019లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఒక క్రికెట‌ర్ లైఫ్ కి సంబంధించి తీశారు ఈసినిమా. ఈ సినిమాని గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ట్ చేశారు. ఇక హిందీలో కూడా ఆయ‌నే ఈ సినిమాని రీమేక్ చేశారు. హిందీలో షాహిద్ క‌పూర్, మృణాల్ న‌టించ‌గా.. రెండు భాష‌ల్లో ఈ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. 


బిజీ బిజీగా మృణాల్... 


మృణాల్ ఠాకూర్ 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత ఆమె 'హాయ్ నాన్న' సినిమా చేయ‌గా.. రెండు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక ఈ మ‌ధ్యే విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న 'ఫ్యామిలీ స్టార్' లో న‌టించారు మృణాల్. అయితే, ఆ సినిమా ఊహించినంత స‌క్సెస్ అవ్వ‌లేదు. ఇక ప్రస్తుతం ఆమె హిందీలో పలు సినిమాల్లో నటిస్తున్నారు. 


Also Read: త్రివిక్రమ్ చెప్పిన పాయింట్ నాకు నచ్చలేదు, ఆ మూవీకి డైలాగ్స్ రాయనన్నారు: విజ‌య్ భాస్క‌ర్