Mrunal Emotional Words: 'సీతారామం' తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా. చక్కటి ప్రేమకథ ఎంతోమందిని మెస్మరైజ్ చేసింది. ఇక ఆ సినిమా అంత హిట్ అవ్వడానికి ఒక ముఖ్య కారణం 'సీత' క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఆ రోల్‌లో మృణాల్ ఠాకూర్ అంతలా ఒదిగిపోయారు. తన అందం, అభినయంతో కుర్రకారును ఉర్రూతలూగించిన హీరోయిన్ మృణాల్. 'సీతారామం', 'హాయ్ నాన్న' సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకుల అభిమాన నటి అయిపోయారు మృణాల్. సీతగా, యశ్నాగా తన పాత్రల్లో ఇమిడిపోయి, తెలుగింటి అమ్మాయిగా అందరి మనసుల్లో నిలిచిపోయింది ఈ మరాఠి అమ్మాయి. అయితే, బాలీవుడ్ వాళ్లు మాత్రం తనను గుర్తించడం లేదని ఎమోషనల్ అయ్యింది మృణాల్. లవ్‌స్టోరీలకు, రొమాంటిక్ సినిమాలకు తనకు ఛాన్స్ ఇవ్వడం లేదని చెప్పారు.
త్వరలో ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను..
తన తర్వాతి సినిమా 'ఫ్యామిలీ స్టార్' గురించి విషయాలు చెప్తూ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకుంది మృణాల్. "హిందీలో చాలా సినిమాల ఆఫర్స్ వస్తున్నాయి. కానీ, మంచి ప్రేమకథ మాత్రం రావడం లేదు. అలాంటి సినిమాలు చేయాలని ఉంది. నాకు రొమాంటిక్ లవ్‌స్టోరీస్ రావడం లేదు. నన్ను నిరూపించుకోవడానికి ఇంక ఎంతగా ప్రయాసపడాలో నాకు అర్థం కావడం లేదు. ఇంకా ఎంతగా ప్రయాసపడాలో అర్థం కావడం లేదు. బహుశా నేను ఇంకా అక్కడ అంత ఫేమస్ కాలేదేమో. హిందీలో మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. రొమాంటిక్ సినిమాలు అంటే చాలా ఇష్టం.. కానీ, ఆ ఛాన్సులు రావడం లేదు. బాలీవుడ్‌లో షారూఖ్‌ఖాన్‌ని 'కింగ్ ఆఫ్ రొమాన్స్' అంటారు. నన్ను 'క్వీన్ ఆఫ్ రొమాన్స్' అంటారు. అలాంటప్పుడు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతాను. రొమాంటిక్ సినిమాలు చూస్తూ పెరిగానని, అలాంటి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను అని, మీలాంటి వాళ్లు ఇచ్చే కాంప్లిమెంట్స్ కూడా బూస్ట్ ఇస్తాయి. 'సీతారామం' సినిమా మంచి అవకాశం అని, అలాంటి మంచి రోల్స్ వేరే భాషల్లో కూడా రావాలని కోరుకుంటున్నాను. త్వరలోనే హిందీలో మంచి లవ్‌స్టోరీ చేసే అవకాశం వస్తఉందని కోరుకుంటున్నాను" అని చెప్పారు మృణాల్.
Also read : ఈసారి ఏడిపించను, అంతా ఎంటర్‌టైన్మెంటే - ‘ఫ్యామిలీ స్టార్’పై మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇక 'ఫ్యామిలీ స్టార్' గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో అన్ని జోనర్స్ ఉంటాయని చెప్పారు. పాటలు, డ్యాన్స్ అన్ని ఉంటాయని అన్నారు. ఈ సినిమా అంటేనే 'ఎంటర్‌టైన్మెంట్.. ఎంటర్‌టైన్మెంట్.. ఎంటర్‌టైన్మెంట్' అని తన ప్రాజెక్ట్ గురించి చెప్పారు మృణాల్. ఇక తెలుగులో పాటు హిందీలో తాను లీడ్‌రోల్ ప్లే చేస్తున్న 'పూజా మేరీ జాన్' సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కానున్నట్లు చెప్పారు మృణాల్. పూజా అనే అమ్మాయి జీవితం చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా. ప్రముఖ డైరెక్టర్లు నవ్‌జోత్ గులాటి, విపాషా అర్వింద్ దీన్ని తెరకెక్కిస్తుండగా.. హ్యుమా ఖురేషి, విజయ్‌రాజ్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.
Also Read: అందుకే ఆ బంధాన్ని ముగించేశాను, అవన్నీ గుర్తొస్తే కన్నీళ్లొస్తాయి - విడాకులపై నిహారిక కామెంట్స్